epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ప్రతీ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తాం: మంత్రి కొండా సురేఖ

కాకతీయ, వరంగల్ : రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణ తో ముందుకు సాగుతోందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. శనివారం మంత్రి సురేఖ వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ఆరు దేవాలయాలకు రూ.4.35 కోట్ల వ్యయంతో చేపట్టే అభివృద్ధి పనులకు నగర మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదతో కలిసి శంకుస్థాపనలు చేశారు.

ఈ కార్యక్రమంలో సురేఖ మాట్లాడుతూ మట్టేవాడ భోగేశ్వర స్వామి దేవాలయం, దేశాయిపేట రంగనాయక స్వామి దేవాలయం, కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం, గోవిందరాజుల గుట్ట వద్ద ఆంజనేయ స్వామి దేవాలయం నిర్మాణం, కాశీ విశ్వేశ్వర రంగనాయక స్వామి దేవాలయం కాశిబుగ్గ, అబ్బని కుంటలోని మహేశ్వరి దేవాలయాల అభివృద్ధి నవీకరణ పనులకు నేడు శంకుస్థాపన చేశామని, నియోజకవర్గంలోని ప్రతీ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు. అభివృద్ధి పనులను నాణ్యతతో, వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామన్నారు.

భక్తులకు సౌకర్యార్థంగా ఉండేలా నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. తూర్పు నియోజకవర్గానికి 18 దేవాలయాల అభివృద్ధి పనులకు మంజూరు చేశామని, అందులో భాగంగా నేడు ఆరు దేవాలయాల అభివృద్ధి పనులను ప్రారంభించామన్నారు. మిగిలిన ఆలయాల అభివృద్ధి పనులకు త్వరలో శంకుస్థాపన చేస్తామన్నారు. కాతీయుల కాలం నాటి చారిత్రాత్మక దేవాలయాలు వరంగల్ లో అధికంగా ఉన్నందున వాటిని పునరుద్ధరణ చేసి భవిష్యత్ తరాలకు అందించాలన్నారు.

పురావస్తు శాఖ అనుమతితో ఆయా దేవాలయాలు అభివృద్ధి చేస్తామని, దేవాదాయ శాఖకు సంబంధించిన అన్ని దేవాలయాలకు నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు. కార్యక్రమాల్లో కార్పొరేటర్లు రామ తేజస్వి శిరీష్, కావేటి కవిత, చింతాకుల అనిల్ కుమార్, ఓని స్వర్ణలత భాస్కర్, సోమిశెట్టి ప్రవీణ్ కుమార్, ఎండోమెంట్ అధికారి సునీత, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.