epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

‘క్లీన్ సిటీ’గా తీర్చిదిద్దుతాం

‘క్లీన్ సిటీ’గా తీర్చిదిద్దుతాం
2027 డిసెంబర్ నాటికి వంద శాతం సీసీ రోడ్లు
15 నుంచి 20 రోజుల్లో పట్టణంలో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్
మున్సిపల్ సిబ్బందికి బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి
కలెక్టర్ చాహత్ బాజ్ పాయి ఆధ్వర్యంలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం

కాకతీయ, పరకాల : ప్రత్యేక కార్యాచరణ ద్వారా రాబోయే 15 నుంచి 20 రోజుల్లో పరకాల పట్టణాన్ని ‘క్లీన్ సిటీ’గా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖల సమన్వయంతో ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నట్లు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తెలిపారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, మురుగునీటి పారుదలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. శనివారం పరకాల మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన పురపాలక సంఘం అత్యవసర సమావేశంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ పోతరాజు పవన్, స్థానిక కౌన్సిలర్లు పాల్గొన్నారు. సమావేశం ప్రారంభం కాగానే కౌన్సిలర్లు తమ తమ వార్డుల్లో ఎదురవుతున్న పారిశుద్ధ్య లోపాలు, సిబ్బంది కొరత, డ్రైనేజీ సమస్యలు, తాగునీటి సరఫరా తదితర అంశాలను సభ దృష్టికి తెచ్చారు. సభ్యులు లేవనెత్తిన ప్రతి సమస్యపై ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ తక్షణ పరిష్కారానికి అధికారులను ఆదేశించారు.

2027 డిసెంబర్ నాటికి మౌలిక వసతుల పూర్తి

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.. 2027 డిసెంబర్ నాటికి పరకాల పట్టణంలోని అన్ని వార్డుల్లో వంద శాతం సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాన్ని పూర్తి చేయడమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని ప్రకటించారు. పట్టణంలోని స్లమ్ (నలిగిపోయిన) ప్రాంతాల అభివృద్ధికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ ‘జీ ప్లస్-2’ విధానంలో ఇళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని, ఇందుకు కౌన్సిలర్లు పూర్తి సహకారం అందించాలని కోరారు. వర్షాకాలంలో ఎక్కడా మురుగునీరు నిల్వ ఉండకుండా చూడాలని, అవసరమైన చోట్ల కొత్త డ్రైనేజీల కోసం డీపీఆర్‌లు సిద్ధం చేయాలన్నారు. మున్సిపల్ పన్నుల వసూళ్లను 90 శాతానికి పెంచడం ద్వారా కేంద్ర ప్రభుత్వ నిధులను అధికంగా పొందే అవకాశం ఉంటుందని, అధికారులు, ప్రజాప్రతినిధులు ఇందుకోసం సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మార్కెట్, బస్టాండ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి టౌన్ ప్లానింగ్, పోలీస్ శాఖలు సంయుక్తంగా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

బయోమెట్రిక్ తప్పనిసరి.. సోలార్ పవర్‌కు ఆమోదం

మున్సిపల్ సిబ్బంది పనితీరును మెరుగుపరచడానికి, హాజరును పర్యవేక్షించడానికి రెండు కొత్త బయోమెట్రిక్ యంత్రాలను వెంటనే కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా బయోమెట్రిక్ ద్వారానే హాజరు నమోదు చేయాలన్నారు. ఈ సమావేశంలో పారిశుద్ధ్య పనుల నిర్వహణ కోసం రూ. 4.68 లక్షల వ్యయానికి కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవ ఆమోదం తెలిపారు. అలాగే పట్టణంలో చెత్త సేకరణ కోసం మూడు కొత్త స్వచ్ఛ ఆటోల కొనుగోలుకు, మున్సిపల్ కార్యాలయంపై సోలార్ విద్యుత్ వ్యవస్థ ఏర్పాటు ప్రతిపాదనలకు సభ ఆమోదం తెలిపింది. ఎస్సీ కాలనీల్లో ఇంటి నంబర్లు లేని గృహాలకు వెంటనే నంబర్లు కేటాయించేలా ప్రభుత్వానికి నివేదికలు పంపాలన్నారు.

అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు

హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ.. ప్రతి వార్డులో ప్రతిరోజూ పారిశుద్ధ్య పనులు నిరంతరాయంగా సాగాలని, కొత్తగా కొనుగోలు చేసే స్వచ్ఛ ఆటోలకు ‘జీపీఎస్ ట్రాకింగ్’ వ్యవస్థను అనుసంధానం చేయాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. ఔట్‌సోర్సింగ్ సిబ్బంది ఎవరైనా మరణించినా లేదా అనారోగ్య కారణాలతో విధులకు రాలేకపోయినా, వారి కుటుంబ సభ్యులకు ఆ ఉద్యోగ అవకాశం కల్పించే మానవీయ అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ఎస్సీ కాలనీల్లో ఇంటి నంబర్ల సమస్యను రెవెన్యూ, మున్సిపల్ శాఖలు క్షేత్రస్థాయిలో ఉమ్మడిగా పరిశీలించి పరిష్కరించాలని తహసీల్దార్ విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ పవన్‌లను కలెక్టర్ ఆదేశించారు. ఈ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పరకాల తహసీల్దార్ విజయలక్ష్మి, ఏసీపీ సతీష్ బాబు, వివిధ విభాగాల అధికారులు, కౌన్సిలర్లు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.