epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఎంజీఎంలో ‘వైద్య’ వికారం..

ఎంజీఎంలో ‘వైద్య’ వికారం..
రోజుకు 50 స్కానింగ్‌లే.. మిగతా రోగులకు చుక్కలే!
ఎక్స్‌రే రిపోర్టుల్లో పొంతన లేని ఫలితాలు
ఆపరేషన్ అవసరమన్న వైద్యులు.. థియేటర్ వద్దకు వెళ్లాక వద్దంటూ వెనక్కి!
పిచ్చిమొక్కలు, చెత్తాచెదారంతో అపరిశుభ్రంగా ఆస్పత్రి ఆవరణ
ట్రైనీ నర్సుల బాధ్యతారహితం.. ఎక్కడ పడితే అక్కడ మాస్కుల పారవేత

కాక‌తీయ‌, వరంగ‌ల్ ప్ర‌తినిధి : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి వైద్య సేవలు రోజురోజుకూ దిగజారుతున్నాయి. పేరుకు పెద్దాస్పత్రే కానీ అక్కడ అందుతున్న సేవలు మాత్రం రోగులకు శాపంగా మారుతున్నాయి. ఓపీ రోగులకు స్కానింగ్ చేయాలన్నా, రిపోర్టులు అందుకోవాలన్నా పేషెంట్లు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. ఆస్పత్రి ఆవరణ నుంచి ఆపరేషన్ థియేటర్ వరకు అంతా గందరగోళమే! ఎంజీఎంలో రోగ నిర్ధారణ పరీక్షలు ఆశామాత్రంగా సాగుతున్నాయి. ఓపీ రోగులకు రోజుకు కేవలం 50 మందికి మాత్రమే స్కానింగ్ చేయాలనే ‘అలిఖిత’ నియమం అమలవుతోంది. ఆ సంఖ్య దాటితే రోగులు ఎమర్జెన్సీ వార్డులోని స్కానింగ్ గదికి పరుగులు తీయాల్సిందే. అక్కడ కూడా అదే డాక్టర్ కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి రావడం రోగులకు నరకప్రాయంగా మారింది. టెస్టుల రిపోర్టుల విషయంలోనూ తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోంది. రిపోర్టులు నేరుగా డాక్టర్ల ఫోన్లకు పంపడం వల్ల, బిజీలో ఉండే వైద్యులు పొరపాటుగా రిపోర్టులను పరిశీలించి తప్పుడు నిర్ధారణలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఒక రోడ్డు ప్రమాద బాధితుడికి రెండుసార్లు ఎక్స్‌రే తీసి ఆపరేషన్ తప్పనిసరి అని చెప్పిన వైద్యులు, 15 రోజుల పాటు ఆపరేషన్ థియేటర్ చుట్టూ తిప్పించి, చివరి నిమిషంలో “ఆపరేషన్ అవసరం లేదు” అని చెప్పడం ఆస్పత్రిలోని వైద్య ప్రమాణాలను ప్రశ్నార్థకం చేస్తోంది.

అధ్వానంగా ఆవరణ.. అపరిశుభ్రతకు కేరాఫ్ అడ్రస్!

ఆస్పత్రి ఆవరణను చూస్తే అది పెద్దాస్పత్రా? లేక చెత్త కుండీనా? అనే సందేహం కలగక మానదు. పిచ్చిమొక్కలు, ఎండిపోయిన ఆకులు, పేరుకుపోయిన వ్యర్థాలతో ఆస్పత్రి పరిసరాలు అసహ్యం కలిగిస్తున్నాయి. ట్రైనీ నర్సులు కూడా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. ఆస్పత్రిలో శిక్షణ పొందే నర్సులు, ధరించిన మాస్కులను దారి పొడవునా పారేస్తున్నారు. కనీసం డస్ట్ బిన్‌లో వేయాలనే కనీస జ్ఞానం కూడా లేకుండా, పారిశుధ్యంపై ఎటువంటి అవగాహన లేకుండా ట్రైనీ నర్సులు ప్రవర్తిస్తుండటం విస్మయానికి గురిచేస్తోంది.

వార్డుల్లోనూ అదే దయనీయ స్థితి!

ఆర్థోపెడిక్ వార్డు వెనుక భాగం నుంచి ఆస్పత్రిలోని వివిధ వార్డుల వరకు అపరిశుభ్రత తాండవిస్తోంది. మరుగుదొడ్ల తలుపులు విరిగిపోవడం, గోడల రంగులు వెలిసిపోయి చూడటానికి అసహ్యంగా ఉండటం, వార్డుల్లో వాడి పడేసిన గ్లౌసులు ఎక్కడ పడితే అక్కడ దర్శనమివ్వడం ఇక్కడి పారిశుధ్య నిర్వహణకు అద్దం పడుతోంది. మండల స్థాయి పీహెచ్‌సీలే శుభ్రతపై ఇంత ప్రచారం చేస్తుంటే, రాష్ట్రంలోనే కీలకమైన ఎంజీఎంలో మాత్రం ఈ దుస్థితి ఏమిటని రోగుల అటెండెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వీడి, ఇప్పటికైనా ఎంజీఎంను బాగు చేయకపోతే.. ఇక రోగుల పాలిట ఆ ఆస్పత్రి ఒక పీడకలగా మిగిలిపోతుందనడంలో సందేహం లేదు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.