epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో సిగ్నల్ కష్టాలు

తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో సిగ్నల్ కష్టాలు

– గంటల తరబడి బ్యాంకు ముందు పడిగాపులు
– తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న మహిళలు,వృద్ధులు
– బ్యాంకులో తరచూ తలెత్తుతున్న సిగ్నల్ సమస్యలు
– శాశ్వత పరిష్కారం చూపాలని స్థానిక ప్రజలు,రైతుల డిమాండ్

కాకతీయ,రాయపర్తి :మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ (టిజిబి) రాయపర్తి శాఖలో సాంకేతిక సమస్యలు,సిగ్నల్ లోపం కారణంగా శనివారం ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.గ్రామీణ ప్రాంతాల నుంచి వృద్ధులు,రైతులు,మహిళలు తమ పెన్షన్లు,పంట పెట్టుబడి సాయం,పొదుపు డబ్బులు డ్రా చేసుకోవడం,డిపాజిట్ చేయడానికి ప్రతి రోజు వందలాదిమంది ఖాతాదారులు ఈ బ్యాంకుకు వస్తుంటారు.బ్యాంకులో సిగ్నల్ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోవడంతో అత్యవసర ఖర్చులకోసం డబ్బులు విత్ డ్రా చేసుకోవడానికి వచ్చిన ఖాతాదారులకు నిరాశే మిగిలింది.ఒకవైపు వానలు పడుతున్నా లెక్క చేయకుండా,మరోవైపు చేతుల పైసలు లేక,అవసరాలకు డబ్బులు అందుతాయనే ఆశతో వివిధ గ్రామాలనుంచి వచ్చిన ప్రజలు ఖాళీ చేతులతో ఇళ్లకు వెనుదిరిగాల్సి వచ్చింది.

*సాగు వేళ సాంకేతిక కష్టాలు..

సిగ్నల్ లోపం కారణంగా ముఖ్యంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.బ్యాంకులో తరచూ సర్వర్ డౌన్ కావడం,సిగ్నల్ సరిగ్గా అందకపోవడంతో స్థానిక రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం వర్షాకాలం కావడంతో గ్రామాల్లో సాగు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.విత్తనాలు ఎరువుల కొనుగోలుకు,పెట్టుబడి సాయం కోసం రైతులు పనులన్నీ మానుకుని బ్యాంకుకు రావాల్సి వస్తుంది.తీరా బ్యాంకుకు వస్తే…ఇక్కడ సిగ్నల్ లేదు,సర్వర్ పని చేయడం లేదు అనే సమాధానం ఎదురవుతుండడంతో అటు వ్యవసాయ పనులకు,ఇటు నిత్యవసరాలకు డబ్బులు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

*రైతుల డిమాండ్

ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రాయపర్తి తెలంగాణ గ్రామీణ బ్యాంకు శాఖలో ఎదురవుతున్న సిగ్నల్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానిక ప్రజలు,రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ సమస్యపై బ్యాంక్ మేనేజర్ హుస్సేన్ ను వివరణ కోరగా..శుక్రవారం సాయంత్రం కురిసిన వర్షం కారణంగా బ్యాంకు భవనం పైన ఉన్న నెట్వర్క్ యాంటీన కదిలిందని, అందుకే సిగ్నల్ సమస్య ఎదురయిందటూ సమాధానం ఇచ్చారు.సాంకేతిక సిబ్బందితో మాట్లాడి సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని ఆయన తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.