అపోలో రీచ్‌లో మూడు రోజుల ప్రత్యేక న్యూరో క్యాంప్
27 నుంచి 29 వరకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు
కాకతీయ, ములుగు ప్రతినిధి : నరాలు, మెదడు, వెన్నుపూస సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించేందుకు వరంగల్ కొత్తపేటలోని అపోలో రీచ్ ఎన్ఎస్ఆర్ ఆసుపత్రిలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో ప్రత్యేక న్యూరో క్యాంప్ నిర్వహించనున్నట్లు ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. ముఖ్యంగా ములుగు జిల్లాలోని మారుమూల గ్రామాలు, ఆదివాసీ ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.
ప్రత్యేక రాయితీలతో వైద్య సేవలు
ఈ శిబిరంలో ప్రముఖ న్యూరో సర్జన్ డా. అభిలాష్ గజ్జల రోగులను పరీక్షించి చికిత్సపై నిపుణుల సలహాలు అందించనున్నారు. తలనొప్పి, పక్షవాతం, మెడ, వెన్నునొప్పి, డిస్క్ సమస్యలు, నరాల బలహీనత, వెన్నుపూస వ్యాధులతో బాధపడుతున్న వారు క్యాంప్‌లో సేవలు పొందవచ్చని తెలిపారు. న్యూరో ప్రొఫైల్ రక్త పరీక్షలు రూ.1,000కే, సీటీ స్కాన్, ఎన్సీఎస్, ఈఈజీ పరీక్షలు ప్రత్యేక రాయితీతో రూ.1,000కే నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వెన్నుపూస శస్త్రచికిత్సలకు 20 శాతం వరకు తగ్గింపు కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు క్యాంప్ కొనసాగుతుందని, ముందస్తుగా పేర్లు నమోదు చేసుకుని అపాయింట్మెంట్ తీసుకోవాలని ఆసుపత్రి యాజమాన్యం సూచించింది. మరిన్ని వివరాలకు 94598 75555ను సంప్రదించాలని తెలిపింది.

