విద్యార్థులకు ఎన్నికలపై అవగాహన
కాకతీయ హైస్కూల్‌లో స్టూడెంట్ క్యాబినెట్ ఎన్నికలు
ఎన్. డిజిటల్ హబ్ ఆధ్వర్యంలో నిర్వహణ
కాకతీయ, మలహర్ మంథని: విద్యార్థుల్లో ప్రజాస్వామ్య విలువలు, ఎన్నికల ప్రక్రియపై అవగాహన పెంచేందుకు ఎన్. డిజిటల్ హబ్ ఆధ్వర్యంలో కాకతీయ హైస్కూల్లో శనివారం స్టూడెంట్ క్యాబినెట్ ఎన్నికలు నిర్వహించారు. నామినేషన్లు, ప్రచారం, రహస్య ఓటింగ్, ఓట్ల లెక్కింపు తదితర ఎన్నికల ప్రక్రియను విద్యార్థులకు ప్రత్యక్షంగా పరిచయం చేశారు. హెడ్ బాయ్‌గా బి. కౌశిక్, హెడ్ గర్ల్‌గా విశ్వశ్రీ, స్పోర్ట్స్ సెక్రటరీగా ఓంకార్, డిప్యూటీ హెడ్ బాయ్‌గా శ్రీ నాగచైతన్య, డిప్యూటీ హెడ్ గర్ల్‌గా అంజలి ప్రియ ఎన్నికయ్యారు. సామాజిక కార్యకర్త కనుకుంట్ల స్వామి, ప్రిన్సిపాల్ ప్రదీప్ రెడ్డి ఎన్నికల ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు.

