జయశంకర్ ఆశయాలను కొనసాగించాలి
ఆత్మకూరులో జయంతి వేడుకలు
తహసీల్దార్ జగన్మోహన్ రెడ్డి పిలుపు
కాకతీయ, ఆత్మకూరు: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఆశయాలను కొనసాగించాలని ఆత్మకూరు తహసీల్దార్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గురువారం అక్కంపేట గ్రామంలో సర్పంచ్ ముద్దం సాంబయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని జయశంకర్ తెలంగాణ ఉద్యమానికి జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. ప్రత్యేక తెలంగాణ ఆవశ్యకతపై పలు గ్రంథాలు రచించి ఉద్యమానికి దిశానిర్దేశం చేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఐ సంతోష్, నాయకులు ముద్దం కృష్ణ, చిలువేరు రాజు తదితరులు పాల్గొన్నారు.

