మేచరాజుపల్లిలో జయశంకర్ జయంతి
చిత్రపటానికి నివాళులర్పించిన గ్రామస్తులు
కాకతీయ, నెల్లికుదురు: తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ఆచార్య జయశంకర్ జయంతిని గురువారం మేచరాజుపల్లిలో ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ తూర్పాటి శంకరయ్య, ఉపసర్పంచ్ తాళ్లపల్లి వెంకన్న ఆధ్వర్యంలో గ్రామస్తులు జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో జయశంకర్ చేసిన సేవలను ఎన్నటికీ మరువలేమన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి హజ్మతుల్లా, పీఏసీఎస్ డైరెక్టర్ కొయ్యడి వెంకన్న, కారోబార్ ధూబర్ల సాయిలు, వార్డు సభ్యుడు జక్కుల యాకన్న, ఉపాధ్యాయులు స్వామి, మొరపోజు శ్రీను, సంపత్, అంగన్‌వాడీ టీచర్లు లీలావతి, మైబు తదితరులు పాల్గొన్నారు.

