మిత్రుడి కుటుంబానికి ఆర్థిక సహాయం
కాకతీయ, గీసుగొండ: అకాలంగా మృతి చెందిన మిత్రుడి కుటుంబానికి అతడి బాల్య స్నేహితులు ఆర్థిక సహాయం చేసి అండగా నిలిచారు. వరంగల్ మహానగర పాలక సంస్థ 15వ డివిజన్ గొర్రెకుంట గ్రామానికి చెందిన మంచాల సురేష్ ఇటీవల మృతిచెందగా, ఆయన కుటుంబానికి బాల్య స్నేహితులు రూ.30 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. గొర్రెకుంట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2001–02 విద్యా సంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసిన సురేష్ సహచర విద్యార్థులంతా కలిసి ఈ సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా సురేష్ చిత్రపటానికి నివాళులర్పించి, ఆయనతో తమకున్న బాల్య స్మృతులను గుర్తుచేసుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం కల్పించారు. కార్యక్రమంలో 2001–02 విద్యా సంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.

