epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మాజీ ఎమ్మెల్యే గొర్రె సిద్దయ్య కన్నుమూత

మాజీ ఎమ్మెల్యే గొర్రె సిద్దయ్య కన్నుమూత

* 1978లో 7,056 ఓట్ల మెజారిటీతో ఘన విజయం

* 95 ఏళ్ల వయసులో హైదరాబాద్‌లో తుదిశ్వాస

కాకతీయ,చేర్యాల: పూర్వపు చేర్యాల నియోజకవర్గ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గొర్రె సిద్దయ్య (95) కన్నుమూశారు. వృద్ధాప్యంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. సిద్దయ్య మృతి వార్తతో కాంగ్రెస్‌ శ్రేణులు, అభిమానులు, చేర్యాల ప్రాంత ప్రజల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

7,056 ఓట్ల మెజారిటీతో చారిత్రక విజయం

ఉమ్మడి వరంగల్ జిల్లా మద్దూరు మండలం బైరాన్‌పల్లి గ్రామానికి చెందిన గొర్రె సిద్దయ్య 1978 ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి చేర్యాల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ (ఐ) అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో సిద్దయ్యకు 18,547 ఓట్లు రాగా, ఆయన ప్రత్యర్థి నిమ్మ రాజారెడ్డికి 11,491 ఓట్లు వచ్చాయి. దీంతో 7,056 ఓట్ల భారీ మెజారిటీతో సిద్దయ్య ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నియోజకవర్గ ప్రజల సమస్యలను అసెంబ్లీ వేదికగా ప్రస్తావిస్తూ, ప్రాంత అభివృద్ధికి కృషి చేశారు. ప్రజలతో మమేకమై పనిచేసిన నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు లభించింది.

1983లోనూ బరిలో.. రెండో స్థానంలో

1978 విజయంతో రాజకీయంగా తనదైన ముద్ర వేసిన సిద్దయ్య 1983 ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో నిమ్మ రాజారెడ్డి విజయం సాధించగా, సిద్దయ్య 20,155 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు.

చేర్యాల నియోజకవర్గంతో చెరగని అనుబంధం

1961లో ఏర్పడిన చేర్యాల అసెంబ్లీ నియోజకవర్గం 2008లో రద్దయింది. ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన మాజీ ఎమ్మెల్యేగా గొర్రె సిద్దయ్య రాజకీయ ప్రస్థానం ప్రత్యేకతను సంతరించుకుంది. అనంతరం ఆయన కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడింది.

భార్య మృతి.. కుమారుడు న్యాయవాది

గొర్రె సిద్దయ్య భార్య గొర్రె శాంతమ్మ సుమారు మూడు సంవత్సరాల క్రితమే మృతి చెందారు. సిద్దయ్యకు ఒక్క కుమారుడు గొర్రె భాస్కర్ ఉన్నారు. భాస్కర్ హైదరాబాద్‌ హైకోర్టులో న్యాయవాదిగా విధులు నిర్వహిస్తున్నారు. సిద్దయ్య మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

పార్థివదేహానికి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి నివాళి

సిద్దయ్య మృతి విషయం తెలుసుకున్న పలువురు రాజకీయ నాయకులు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంతాపం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ జనగామ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి హైదరాబాద్‌లో సిద్దయ్య పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

సిద్దయ్య మృతి కాంగ్రెస్‌ పార్టీకి, చేర్యాల ప్రాంత ప్రజలకు తీరని లోటని పలువురు నాయకులు పేర్కొన్నారు. ఆయన రాజకీయ సేవలను, ప్రజల కోసం చేసిన కృషిని స్మరించుకున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటం

కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటం ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు అందె...

రైతులకు సరిపడా యూరియా అందించాలి

రైతులకు సరిపడా యూరియా అందించాలి ఎరువుల విక్రయాల్లో అవినీతిని అరికట్టాలని డిమాండ్‌ ఎమ్మార్పీ ధరలకే...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి * పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఏబీవీపీ...

జీవో 97 రద్దు చేయాలి

జీవో 97 రద్దు చేయాలి పాలిటెక్నిక్‌ విద్యార్థుల ధర్నా, ర్యాలీ కాకతీయ, చేర్యాల: పాలిటెక్నిక్‌...

ముస్త్యాల రైతు వేదికలో ప్రజావాణి..

ముస్త్యాల రైతు వేదికలో ప్రజావాణి.. *ప్రజా సమస్యలపై 11 ఫిర్యాదులు స్వీకరించిన అధికారులు కాకతీయ,చేర్యాల:...

చేర్యాల మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

చేర్యాల మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ బయోమెట్రిక్‌ హాజరుపై ఆరా.. సిబ్బంది...

కస్తూరిబా బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

కస్తూరిబా బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి ఆరోగ్యం మెరుగయ్యే వరకు మెరుగైన వైద్యం...

చేర్యాల‌లో హర్‌ ఘర్‌ తిరంగా అభియాన్ ర్యాలీ

చేర్యాల‌లో హర్‌ ఘర్‌ తిరంగా అభియాన్ ర్యాలీ ఇంటింటా జాతీయ జెండా ఎగురవేయాలి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.