కాళోజీ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌కు సన్మానం
కాకతీయ, వరంగల్: కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం నూతన రిజిస్ట్రార్‌గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ జె. వెంకటేశ్వర్‌రావును హెల్త్‌కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ (హెచ్‌ఆర్‌డీఏ) వరంగల్ ‘టీమ్ ఇగ్నైట్’ ప్రతినిధులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువాతో సన్మానించి, పూలమొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఎంజీఎం ఆస్పత్రి ఆర్థోపెడిక్స్ విభాగాధిపతిగా 1998–2024 వరకు సేవలందించిన డాక్టర్ వెంకటేశ్వర్‌రావు.. యాదాద్రి భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్, జయశంకర్ భూపాలపల్లి ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. ఆయన అనుభవం విశ్వవిద్యాలయ అభివృద్ధికి దోహదపడుతుందని హెచ్‌ఆర్‌డీఏ ప్రతినిధులు ఆకాంక్షించారు. కార్యక్రమంలో డాక్టర్లు వి. నరేష్‌కుమార్, కె. వెంకటస్వామి, ఎస్. శిరీష్‌కుమార్, ఎం. దిలీప్‌కుమార్, శివ్వా సృజన్, వి. ప్రవీణ్‌కుమార్, జి. రాజేశ్వర్‌రెడ్డి, బన్నా కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

