ఇనుగుర్తి పీఆర్టీయూ టీఎస్ మండల కమిటీ ఎన్నిక
అధ్యక్షుడిగా సూరం భాస్కర్‌రెడ్డి.. ప్రధాన కార్యదర్శిగా బి. వీరన్న
కాకతీయ, ఇనుగుర్తి : ఇనుగుర్తి మండల పీఆర్టీయూ టీఎస్ నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఎన్నుకున్నారు. 2026–28 సంవత్సరానికి సంబంధించి నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో మండల అధ్యక్షుడిగా సూరం భాస్కర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా బి. వీరన్న ఎంపికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా బి. రాములు, రాజేష్‌కుమార్, ఎల్. స్వాతి, ఎస్. స్వప్న, పి. ఉత్తేజ్లను ఎన్నుకున్నారు. జిల్లా శాఖ అధ్యక్షుడు మిర్యాల సతీష్‌రెడ్డి నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. ఎన్నికల పరిశీలకులుగా నెల్లికుదురు మండల అధ్యక్షుడు యుగేందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి వ్యవహరించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి, హక్కుల సాధనకు కృషి చేస్తామని తెలిపారు. పీఆర్టీయూ టీఎస్‌ను మండలంలో మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కేసముద్రం మండల అధ్యక్షుడు గోపాల శ్రీధర్, ప్రధాన కార్యదర్శి బీరం జనార్దన్‌రెడ్డి, మహబూబాబాద్ మండల అధ్యక్షుడు రాంజీ నాయక్, స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు అమ్మ యాకయ్య, అసోసియేట్ అధ్యక్షుడు కళ్లెం వెంకటరెడ్డి, యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి జి. శేఖర్ తదితరులు పాల్గొన్నారు.



