ఆటో యూనియన్ అధ్యక్షుడిగా యాకన్న
కాకతీయ, ఇనుగుర్తి: ఇనుగుర్తి మండల కేంద్రానికి చెందిన లక్ష్మీ నరసింహ స్వామి ఆటో యూనిట్ నూతన కమిటీని సోమవారం ఎన్నుకున్నారు. కమిటీ నూతన అద్యక్షుడు ఆవుల యాకన్న, ఉపాధ్యక్షుడు బానోత్ రాజు, ప్రధాన కార్యదర్శి బూర రాజేష్, కోశాధికారి బానోత్ రాజీవ్ లను కమిటీ ప్రకటించింది. అనంతరం నూతన అధ్యక్షులు మాట్లాడుతూ ఆటో యూనియన్ అభివృద్ధి కోసం పాటుపడతానన్నారు. ఈ కార్యక్రమంలో పసునూరి వెంకన్న, తమ్మడపల్లి వెంకటసాయిలు, లింగాల శ్రీనివాస్, చెట్టబోయిన వినోద్, గుండ్రపెల్లి వీరన్న, బోయిని వెంకన్న, దేవులపల్లి చిన్న వెంకన్న, మాలోత్ భద్రు, పప్పుల యాకన్న, గోపందాస్ కృష్ణ, బండి రాజు, చిట్టిపోతుల ప్రవీణ్, ఎం.డీ యాకూబ్ పాషా, సూర్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.

