epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

అర్ధరాత్రి మ‌ళ్లీ పెద్ది విగ్రహం తొలగింపు

అర్ధరాత్రి మ‌ళ్లీ పెద్ది విగ్రహం తొలగింపు
బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహం..నర్సంపేటలో హైటెన్షన్‌
ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధుల ముందస్తు అరెస్టు
వివిధ పోలీస్‌ స్టేషన్లకు తరలింపు
ఎమ్మెల్యే దొంతి పుట్టినరోజునే ఘ‌ట‌న‌
ఓ వైపు ఎమ్మెల్యే బ‌ర్త్ డే వేడుక‌లు..మ‌రో వైపు ఆందోళ‌న‌లు
నర్సంపేటలో భారీగా పోలీసుల మోహరింపు

కాకతీయ, నర్సంపేట : మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహాన్ని సోమ‌వారం అర్ధ‌రాత్రి త‌ర్వాత తొలగించ‌డంతో నర్సంపేటలో హైటెన్షన్‌ నెలకొంది. నర్సంపేట మెడికల్‌ కాలేజీకి సమీపంలోని ఓ ప్రైవేటు ల్యాండ్‌లో ఇటీవల పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహాన్ని బీఆర్ ఎస్ నేత‌లు, అభిమానుల ఆధ్వ‌ర్యంలో విగ్ర‌హాన్ని ఏర్పాటు చేశారు. అయితే విగ్ర‌హ ఏర్పాటుకు ఎలాంటి అనుమ‌తి లేదని పేర్కొంటూ అధికారులు అర్ధరాత్రి తొలగించ‌డం వివాదాస్ప‌దంగా మారింది. విగ్ర‌హం తొల‌గింపు విష‌యం తెలుసుకున్న ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ముఖ్య నేత‌లు పెద్ద సంఖ్య‌లో న‌ర్సంపేట‌కు చేరుకునే ప్ర‌య‌త్నం చేస్తుండ‌గా.. ఎక్క‌డిక‌క్క‌డ అరెస్టులు చేప‌ట్ట‌డం గ‌మ‌నార్హం. ఈ ఘ‌ట‌న‌పై బీఆర్‌ఎస్‌ శ్రేణులు తీవ్ర ఆగ్రహంతో ర‌గిలిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు. నర్సంపేట పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు.

వివిధ పోలీస్‌ స్టేషన్లకు తరలింపు

నల్లబెల్లి మండలానికి చెందిన ప్రజాప్రతినిధులను ఆత్మకూరు పోలీస్‌ స్టేషన్‌కు తరలించి అక్కడ ఉంచినట్లు సమాచారం. ఇతర మండలాలకు చెందిన సర్పంచులను సమీపంలోని వివిధ పోలీస్‌ స్టేషన్లకు తరలించినట్లు తెలుస్తోంది. బీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకులందరూ ఒకే చోట గుమిగూడకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టినట్లు సమాచారం. పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం తొలగించిన విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, అభిమానులు నర్సంపేటకు చేరుకునే అవకాశం ఉండటంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లతో పాటు మెడికల్‌ కాలేజీ పరిసరాల్లో నిఘా పెంచారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారకుండా పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే పుట్టినరోజు సందడి

ఇదే రోజు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పుట్టినరోజు కావడంతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో సంబరాలు నెలకొన్నాయి. ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలుపుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలు పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఒకవైపు ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో సందడి కనిపిస్తుండగా, మరోవైపు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం తొలగింపు బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో ఆగ్రహం రేకెత్తిస్తోంది. విగ్రహం ఏ కారణాలతో తొలగించారన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారం నర్సంపేటలో రాజకీయంగా దుమారం రేపుతోంది. విగ్రహం తొలగింపును బీఆర్‌ఎస్‌ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.