బంగారు, వెండి నగలు దొంగిలించిన వ్యక్తి అరెస్ట్
రూ.2.42 లక్షల విలువైన నగలు స్వాధీనం : ఆత్మకూరు సీఐ సంతోష్
కాకతీయ, ఆత్మకూరు : ఇంట్లో బంగారు, వెండి నగలు దొంగిలించిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఆత్మకూరు సీఐ సంతోష్ తెలిపారు. శుక్రవారం పెద్దాపూర్ గ్రామంలో వాహనాల తనిఖీల్లో నాగనబోయిన శివరాజ్‌ను పట్టుకున్నట్లు పేర్కొన్నారు. సీఐ వివరాల ప్రకారం.. ఆస్తి వివాదాల నేపథ్యంలో నాగనబోయిన రవి ఇంట్లో సుమారు రూ.2.42 లక్షల విలువైన బంగారు, వెండి నగలు దొంగిలించి, అనంతరం ఇంటికి నిప్పంటించినట్లు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి, నగలతో పాటు హోండా ద్విచక్ర వాహనం, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అరెస్టులో ఎస్సై తిరుపతి, కానిస్టేబుళ్లు కటకం శ్రీనివాస్, జన్ను శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

