epaper
Wednesday, October 28, 2026
epaper
BREAKING NEWS
Loading News...

చక్రపాణి ‘దాడి’ నాటకం!

చక్రపాణి ‘దాడి’ నాటకం!
రూ.2 కోట్లకు క్వారీ కొనుగోలు.. రూ.1.80 కోట్లు చెల్లించా
మిగిలిన రూ.20 లక్షలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా అప్పగించలేదు
సొసైటీ బిల్లుల డబ్బు డ్రా చేసి మాపై ఆరోపణలు
ఆరోపణలన్నీ అవాస్తవం.. పోలీసులకు ఫిర్యాదు చేశాం
టేకులగూడెం ఇసుక సబ్‌కాంట్రాక్టర్ విక్రమ్‌రెడ్డి ఆరోప‌ణ‌లు

కాకతీయ, తెలంగాణ బ్యూరో : బీఆర్‌ఎస్‌ నేత, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్‌ చంద చక్రపాణి తనపై దాడి జరిగిందంటూ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, తన కారును తానే ధ్వంసం చేసుకుని తమపై నిందలు వేస్తున్నారని టేకులగూడెం ఇసుక సబ్‌కాంట్రాక్టర్‌ విక్రమ్‌రెడ్డి ఆరోపించారు. టేకులగూడెం ఇసుక క్వారీని చక్రపాణి నుంచి రూ.2 కోట్లకు కొనుగోలు చేశామని, ఇప్పటికే రూ.1.80 కోట్లు చెల్లించామని తెలిపారు. ఇంకా చెల్లించాల్సిన రూ.20 లక్షలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ క్వారీని తమకు అప్పగించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. శుక్ర‌వారం ములుగులో విక్ర‌మ్‌రెడ్డి విలేక‌రుల‌తో మాట్లాడారు. ఈ వ్యవహారానికి రాజకీయ రంగు పులిమి కాంగ్రెస్‌ నాయకుల పేర్లను తెరపైకి తెస్తున్నారని మండిపడ్డారు. చక్రపాణి కారుపై దాడి జరిగిందన్న వార్తలను మీడియా ద్వారా తెలుసుకున్నానని విక్రమ్‌రెడ్డి తెలిపారు. తాను కరీంనగర్‌లో ఉండగా విషయం తెలియడంతో అసలు వాస్తవాలను వెల్లడించేందుకు విలేకరుల ముందుకు వచ్చినట్లు చెప్పారు. దాడి ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

రూ.2 కోట్లకు క్వారీ.. రూ.1.80 కోట్లు చెల్లింపు

టేకులగూడెం ఇసుక క్వారీని చక్రపాణి నుంచి రూ.2 కోట్లకు కొనుగోలు చేసినట్లు విక్రమ్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే రూ.1.80 కోట్లు చెల్లించామని, మిగిలిన రూ.20 లక్షలు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అయినప్పటికీ క్వారీని తమకు పూర్తిగా అప్పగించకుండా చక్రపాణి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. సొసైటీకి సంబంధించిన చెక్‌బుక్‌ విషయంలోనూ చక్రపాణి వ్యవహరించిన తీరుపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. సొసైటీకి తెలియకుండా చెక్‌బుక్‌ను తీసుకెళ్లి అధ్యక్షుడు, సభ్యుల నుంచి ఖాళీ చెక్కులపై సంతకాలు తీసుకున్నారని ఆరోపించారు. ఈ విషయమై గ్రామంలో పలుమార్లు పంచాయితీలు జరిగినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. సొసైటీకి బిల్లులు వచ్చిన తర్వాత సభ్యుల సమక్షంలో వాటిని పంపిణీ చేయాల్సి ఉండగా చెక్‌బుక్‌ వ్యవహారం కారణంగా పీవో అధికారులు చెక్కులను రద్దు చేసినట్లు విక్రమ్‌రెడ్డి తెలిపారు. చెక్కులపై రెడ్‌ పెన్‌తో కొట్టి చెక్‌బుక్‌ను క్యాన్సిల్‌ చేశారని చెప్పారు. తమకు రావాల్సిన బిల్లుల మొత్తాన్ని కూడా చక్రపాణి తమకు తెలియకుండా డ్రా చేసుకున్నారని ఆరోపించారు. తమకు రావాల్సిన డబ్బులు చెల్లించకుండా, క్వారీని అప్పగించకుండా ఇబ్బందులు పెడుతూ ఇప్పుడు దాడి జరిగిందంటూ ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. తమ మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీలను రాజకీయ వివాదంగా మార్చే ప్రయత్నం జరుగుతోందన్నారు.

కాంగ్రెస్‌ నేతల పేర్లతో రాజకీయ రంగు

తనపై దాడి ఘటనలో కాంగ్రెస్‌ నాయకుల పేర్లను చక్రపాణి ప్రస్తావించడం పూర్తిగా రాజకీయ ప్రచారంలో భాగమేనని విక్రమ్‌రెడ్డి అన్నారు. పైడాకుల శివకుమార్‌, లచ్చు పటేల్‌ తదితరులకు ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. చక్రపాణి ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. బీఆర్‌ఎస్‌ నాయకుడు వై.సతీష్‌రెడ్డి తమను ఫోన్‌లో బెదిరిస్తూ ఒత్తిడి తీసుకొచ్చారని కూడా విక్రమ్‌రెడ్డి ఆరోపించారు. తమపై రాజకీయ ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. చక్రపాణి తన కారును తానే ధ్వంసం చేసుకుని తమపై దాడి ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో తమ ప్రమేయం లేదని స్పష్టం చేస్తూ ఎస్పీ కార్యాలయానికి వచ్చి తాము కూడా ఫిర్యాదు చేసినట్లు విక్రమ్‌రెడ్డి తెలిపారు. చెక్‌బుక్‌ వ్యవహారం, తమకు రావాల్సిన బిల్లుల డబ్బులపై పోలీసులకు వివరాలు అందించామని చెప్పారు. తమకు రావాల్సిన డబ్బులు చెల్లించి, క్వారీని అప్పగించాలని కోరుతున్నామని తెలిపారు. దాడి ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని, చక్రపాణి చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని విక్రమ్‌రెడ్డి తేల్చిచెప్పారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పేదలకు ఇళ్లు.. రైతులకు రహదారులు

పేదలకు ఇళ్లు.. రైతులకు రహదారులు రెండో విడతలో మరో 1,100 ఇందిరమ్మ ఇళ్లు పొలాల...

తుమ్మిడిహెట్టిపై మ‌హారాష్ట్ర సానుకూలం!

తుమ్మిడిహెట్టిపై మ‌హారాష్ట్ర సానుకూలం! 152 మీటర్ల ఎత్తు ప్రతిపాదనపై పునఃపరిశీలనకు సీఎం ఫ‌డ్న‌వీస్‌...

మెడికవర్‌పై ఉన్న శ్రద్ధ.. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులపై ఏదీ?

మెడికవర్‌పై ఉన్న శ్రద్ధ.. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులపై ఏదీ? 17 వేల మంది ఉద్యోగుల...

కాంగ్రెస్‌ తెచ్చిన కరువు!

కాంగ్రెస్‌ తెచ్చిన కరువు! దేవాదుల, కల్వకుర్తి నుంచి ఎందుకు నీళ్లు ఎత్తడం లేదు? తమ్మిడిహట్టి...

కరువును వదిలి ఢిల్లీ పర్యటనలా?

కరువును వదిలి ఢిల్లీ పర్యటనలా? ఖర్గే వ్యాఖ్యలు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం ఓటర్ల ప్రత్యేక...

బౌద్ధ స్తూపానికి పూర్వ వైభవం!

బౌద్ధ స్తూపానికి పూర్వ వైభవం! అంతర్జాతీయ బౌద్ధ పర్యాటక కేంద్రంగా నేలకొండపల్లి 10 రోజుల్లో...

రేడియ‌ల్ రోడ్ టెండ‌ర్ల‌లో అక్ర‌మాలు

రేడియ‌ల్ రోడ్ టెండ‌ర్ల‌లో అక్ర‌మాలు రోడ్‌–2 ప్రాజెక్టులో ఆర్థిక అవకతవకలు జ‌రిగాయి బినామీల‌కు కాంట్రాక్ట‌ర్ల‌కు...

కన్నెపల్లి ర్యాంప్‌లో అద‌న‌పు వ‌సూళ్లు

కన్నెపల్లి ర్యాంప్‌లో అద‌న‌పు వ‌సూళ్లు కాసుల దందాకు టీజీఎండీసీ అధికారుల అండ! ఆదివారం ఒక్కో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.