ప్రేరణ కార్యక్రమంలో ప్రతిభకు గుర్తింపు
ప్రధానమంత్రి ప్రశంసలు పొందిన విద్యార్థి దీక్షిత్
విద్యార్థిని సత్కరించిన పాఠశాల యాజమాన్యం
కాకతీయ, నెల్లికుదురు : ప్రేరణ కార్యక్రమంలో ప్రతిభ కనబరిచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి ప్రశంసాపత్రం అందుకున్న సింగారం దీక్షిత్‌ను ఆదర్శ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఉపేందర్‌రావు శనివారం సత్కరించారు. పదో తరగతి చదువుతున్న దీక్షిత్ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని వివిధ పోటీల్లో ప్రతిభ చాటినట్లు ఉపాధ్యాయులు తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల విద్యార్థులతో కలిసి విలువైన అనుభవాలు పొందాడన్నారు. ప్రధాని ప్రశంసలు అందుకోవడం పాఠశాల, తల్లిదండ్రులకు గర్వకారణమన్నారు. విద్యార్థికి మార్గదర్శకత్వం అందించిన ఉపాధ్యాయులు అంజమ్ సుల్తానా, టి. సతీష్‌లను కూడా సత్కరించారు. దీక్షిత్ మాట్లాడుతూ తన విజయానికి గైడ్ టీచర్ల ప్రోత్సాహమే కారణమన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు యుగంధర్, నాగమోహన్, నవీన్‌కుమార్, సక్రాం, కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు

