epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కోర్టు ఆదేశాలు బేఖాతార్‌

కోర్టు ఆదేశాలు బేఖాతార్‌
ఆదేశాలిచ్చి చేతులు దులుపుకున్న భూపాలపల్లి డీఈవో
లోన్‌ తీసుకున్న ఉపాధ్యాయుడికి ఫుల్‌ జీతం
ష్యూరిటీ ఇచ్చిన టీచర్‌ జీతంలో కట్‌
పరిస్థితిపై కోర్టు ఆగ్రహం.. వెంటనే చర్యలు చేపట్టాలంటూ విద్యాశాఖకు ఆదేశం
కోర్టు ఆదేశాల అమలును పట్టించుకోని భూపాలపల్లి జిల్లా విద్యాశాఖ యంత్రాంగం

కాకతీయ, భూపాలపల్లి : ఓ ఉపాధ్యాయుడు తీసుకున్న రుణానికి ష్యూరిటీగా నిలిచిన మరో ఉపాధ్యాయుడి జీతం నుంచి డబ్బులు మినహాయిస్తున్నప్పటికీ.. అసలు రుణం తీసుకున్న ఉపాధ్యాయుడి జీతం నుంచి మాత్రం ఎలాంటి కోతలు లేకపోవడం వివాదాస్పదంగా మారింది. ఈ వ్యవహారంలో కోర్టు జోక్యం చేసుకుని జీతం నుంచి మొత్తాన్ని మినహాయించి చెల్లించాలని ఆదేశించినా.. ఆ ఆదేశాల అమలు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. భూపాలపల్లి జిల్లా విద్యాశాఖ యంత్రాంగం కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం రంగాపురం జెడ్పీఎస్‌ఎస్‌లో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న అడెపు వెంకటేశ్వర్లు రుణ వ్యవహారంలో ష్యూరిటీగా ఉన్నట్లు కోర్టు పరిధిలోకి వెళ్లిన కేసు ద్వారా తెలుస్తోంది. రుణ బకాయిలకు సంబంధించి శ్రీ రామం చిట్‌ఫండ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ హనుమకొండ నాలుగో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టును ఆశ్రయించింది. సంస్థకు మొత్తం రూ.11,20,821 బకాయి ఉన్నట్లు పేర్కొంటూ కోర్టును ఆశ్రయించింది. ఈ వ్యవహారంలో కోర్టు ఆదేశాల మేరకు వెంకటేశ్వర్లు జీతం నుంచి రూ.3,73,607 మొత్తాన్ని మినహాయించాలని డీఈవో కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.

డీఈవో ఉత్తర్వులు.. అమలు ఏది?

కోర్టు ఆదేశాలను ఉటంకిస్తూ భూపాలపల్లి జిల్లా విద్యాశాఖ అధికారి ఎం. రాజేందర్‌ 2026 జూలై 22న రంగాపురం జెడ్పీఎస్‌ఎస్‌ హెడ్‌మాస్టర్‌కు ఉత్తర్వులు జారీ చేశారు. జీతం నుంచి నిర్దేశిత మొత్తాన్ని మినహాయించి హనుమకొండ నాలుగో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి పేరిట డీడీ రూపంలో చెల్లించాలని ఆదేశించారు. అలాగే తీసుకున్న చర్యలపై వెంటనే తమ కార్యాలయానికి సమాచారం అందించాలని స్పష్టం చేశారు. అయితే ఆ ఉత్తర్వులు జారీ చేసి నెల రోజులు దాటుతున్నా.. కోర్టు ఆదేశాల మేరకు జీతం నుంచి మినహాయింపులు జరిగాయా? మినహాయించిన మొత్తం కోర్టుకు చేరిందా? అనే విషయాలపై స్పష్టత లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. కోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిన విద్యాశాఖ అధికారులు ఆ తర్వాతి పరిణామాలను పర్యవేక్షించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

లోన్‌ తీసుకున్న వ్యక్తికి ఫుల్‌ జీతం?

ఈ వ్యవహారంలో ప్రధానంగా మరో ప్రశ్న తలెత్తుతోంది. రుణం తీసుకున్న వ్యక్తి జీతం నుంచి కాకుండా ష్యూరిటీ ఇచ్చిన ఉపాధ్యాయుడి జీతం నుంచి మాత్రమే కోతలు ఎందుకు? అన్నదే ఆ ప్రశ్న. ఒకవైపు బాధిత ఉపాధ్యాయుడి జీతం నుంచి మినహాయింపులు జరుగుతున్నట్లు చెబుతుండగా.. మరోవైపు అసలు రుణగ్రహీతకు పూర్తి జీతం అందుతున్న పరిస్థితి ఉంటే దానిపై అధికారులు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ వాటిని అమలు చేయడంలో జాప్యం జరగడం, సంబంధిత ఉద్యోగుల జీతాల విషయంలో భిన్నమైన పరిస్థితులు ఉండటం పట్ల బాధిత వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కోర్టు ఆదేశాలను అమలు చేయాలని డీఈవో స్వయంగా ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో.. వాటి అమలుపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? జీతం నుంచి ఎంత మొత్తం మినహాయించారు? మినహాయించిన మొత్తాన్ని కోర్టుకు ఎప్పుడు చెల్లించారు? అసలు రుణగ్రహీత జీతం నుంచి ఎందుకు మినహాయింపులు చేయలేదు? అనే ప్రశ్నలకు విద్యాశాఖ అధికారులు సమాధానం చెప్పాల్సి ఉంది. కోర్టు ఆదేశాలు కాగితాలకే పరిమితం కాకుండా పూర్తిస్థాయిలో అమలయ్యేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వ్యవహారంపై జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులు సమగ్రంగా పరిశీలించి, కోర్టు ఆదేశాల అమలులో జాప్యానికి కారణాలను వెల్లడించాలని పలువురు కోరుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.