వివాహ వేడుకల్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి
కాకతీయరాయపర్తి : మండల పరిధిలో బుధవారం నిర్వహించిన పలు వివాహ వేడుకల్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఎర్రబెల్లి రాకతో కళ్యాణ మండపాల వద్ద ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. రాయపర్తికి చెందిన దొనగోని రవి గౌడ్ కూతురు సహస్ర-సందీప్ గౌడ్ వివాహం వర్ధన్నపేట ఏబీఎస్ వేడుకల మందిరంలో జరిగింది.ఈ సందర్భంగా నూతన వివాహ బంధంలోకి అడుగుపెట్టిన నవదంపతులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.అక్షతలు వేసి వారి దాంపత్య జీవితం సంతోషకరంగా సాగాలని ఆశీర్వదించారు.కోలనుపల్లి గ్రామానికి చెందిన టీఎం రంగమాచార్యులు కూతురు సుష్మా-సాయి శ్రీనివాస్ వివాహానికి హాజరై నవ దంపతులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ రంగు కుమార్,చందు రాము,సతీష్,ఎల్ల స్వామి,సాయి గౌడ్,లక్ష్మణ్,సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

