epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

నకిలీ వైద్యులపై కఠిన చర్యలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో నకిలీ వైద్యులపై అధికారులు గట్టి నిఘా పెట్టి, చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (TGMC) రిజిస్ట్రార్ డా. డి. లాలయ్య కుమార్ ఫిర్యాదు మేరకు ఇంతేజర్‌గంజ్, కాకతీయ యూనివర్సిటీ ఎక్స్ రోడ్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి. ఎఫ్‌ఐఆర్ నంబర్లు 357/2025, 507/2025 కింద మామిడి ఈశ్వరయ్య, సి. హెచ్. వెంకట్ రెడ్డిలపై నకిలీ వైద్యం చేస్తున్నారని ఆరోపణలతో కేసులు నమోదు చేశారు. కాశిబుగ్గ, గోపాల్‌పూర్ ప్రాంతాల్లో వీరు ఎటువంటి వైద్య అర్హతలు లేకుండా డాక్టర్లుగా మారి, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

తాజా తనిఖీల్లో ఈ నకిలీ వైద్యులు అవసరం లేని సందర్భాల్లో అధిక మోతాదులో యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్స్ వాడుతూ, ప్రభుత్వ అనుమతి లేకుండా బెడ్స్ ఏర్పాటు చేసి చిన్న హాస్పిటల్స్ లాగా నడుపుతున్నట్లు బయటపడింది. ప్రజారోగ్యానికి హాని కలిగించే ఈ చర్యలు అత్యంత ప్రమాదకరమని అధికారులు హెచ్చరించారు. గోపాల్‌పూర్‌లో సాధుల్లా మెడికల్‌కు చెందిన అబ్దుల్ షరీఫ్ అనే వ్యక్తి కూడా నకిలీ వైద్యుడిగా బయటపడ్డాడు. అయితే ఆయన ఇకపై వైద్యం చేయనని అఫిడవిట్ ఇచ్చినందున కేసు నమోదు చేయలేదు. కానీ ఇలాంటి వారిపై విజిలెన్స్ అధికారులు తరచూ నిఘా ఉంచుతారని వెల్లడించారు.

TGMC అధికారులు స్పష్టం చేసిన విషయమేమిటంటే, RMP, PMP లకు అల్లోపతి వైద్యం చేసే అర్హత అసలు లేదని. ఇంజెక్షన్లు వేయడం, సెలైన్ పెట్టడం, ల్యాబ్ టెస్టులు నిర్వహించడం, బెడ్స్ ఏర్పాటు చేయడం వీరి పరిధిలోకి రావని హెచ్చరించారు. అర్హత లేని వైద్యులు చేసే చికిత్సల వల్ల ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉందని, ఇటీవల అక్కంపల్లి గ్రామంలో మార్కండేయ అనే నకిలీ వైద్యుడు చేసిన తప్పు చికిత్స కారణంగా 25 ఏళ్ల యువకుడు మృతి చెందిన సంఘటనను ఉదాహరణగా పేర్కొన్నారు.

పబ్లిక్ రిలేషన్ కమిటీ చైర్మన్ డా. వి.నరేష్ కుమార్ మాట్లాడుతూ, అర్హత లేకుండా వైద్యం చేసే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. చట్టం ప్రకారం నకిలీ వైద్యులపై రూ.5 లక్షల వరకు జరిమానా మరియు కనీసం ఒక సంవత్సరం నుంచి గరిష్టంగా మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉందని తెలిపారు. అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, అర్హతలేని వ్యక్తుల దగ్గర చికిత్స చేయించుకోవద్దని, నకిలీ డాక్టర్లను గుర్తించి ఫిర్యాదు చేయాలని సూచించారు.

 

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

కరెంటు లేక రైతుల అవస్థలు

కరెంటు లేక రైతుల అవస్థలు కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంటలు ఎండుతున్నాయి ఎల్‌నినో ముప్పు...

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌ రూ.650 కోట్ల బొగ్గు నిధుల మళ్లింపుపై సోదాలు! హైదరాబాద్‌లో ఏఎంఆర్‌...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..!

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..! నాపై వార్తలు రాసిన వాళ్లపై కేసులు పెట్టండి ‘కాకతీయ’ స్టాఫర్‌పై...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.