గణపతి నవరాత్రి ఉత్సవాల్లో రక్తదానం
జై భవాని కమిటీ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం
కాకతీయ, హనుమకొండ : గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కిషన్పుర జై భవాని కమిటీ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పరికిపండ్ల నవీన్, కునమల్ల సునీల్, దాసి రమేష్, కునమల్ల అఖిల్, వేములపల్లి రాజకుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పలువురు యువకులు, భక్తులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. గణపతి నవరాత్రి ఉత్సవాలను కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలకే పరిమితం చేయకుండా సామాజిక సేవా కార్యక్రమాలకు వేదికగా మలచాలనే ఉద్దేశంతో రక్తదాన కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారికి రక్తదానం ఎంతో ప్రాణదాయకమని పేర్కొన్నారు. యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదాన కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జై భవాని కమిటీ సభ్యులు, యువత, భక్తులు పాల్గొన్నారు.

