ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకున్న బ్లూకోల్ట్ సిబ్బంది
సిబ్బందికి నగదు రివార్డులు అందించిన సీపీ ఎన్.శ్వేత
కాకతీయ, హనుమకొండ: ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి ప్రాణాలను బ్లూకోల్ట్ సిబ్బంది వీరాస్వామి, తరుణ్‌కుమార్ సమయస్ఫూర్తితో కాపాడారు. కేయూ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గుండ్ల సింగారానికి చెందిన వ్యక్తి శుక్రవారం ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోవడంతో ఆందోళన చెందిన భార్య డయల్ 112కు సమాచారం ఇచ్చింది. మొబైల్ లొకేషన్ ఆధారంగా చింతగట్టు శివారులోని రైల్వే ట్రాక్ వద్ద అతడిని గుర్తించిన పోలీసులు, ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకుని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ సందర్భంగా సిబ్బందిని పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత అభినందించి నగదు రివార్డులు అందజేశారు. ప్రజల ప్రాణాలు, భద్రతకు ప్రాధాన్యమిస్తూ విధులు నిర్వహించే సిబ్బందిని ప్రోత్సహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో డీసీపీ ధార కవిత, అదనపు డీసీపీ రాయల ప్రభాకర్‌రావు, ఇన్స్పెక్టర్ రవికుమార్ పాల్గొన్నారు.

