epaper
Saturday, October 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా చేయాలి

జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా చేయాలి
13 కోట్ల ఓట‌ర్ల‌ పేర్ల తొలగింపుపై సీఐటీయూ నిరసన
ఢిల్లీ ఆందోళనకారులకు మద్దతుగా హైదరాబాద్‌లో ధర్నా

కాక‌తీయ‌,హైద‌రాబాద్ : హైదరాబాద్‌: కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ సీఐటీయూ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లోని గోల్కొండ చౌరస్తాలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఓటర్ల జాబితాల నుంచి 13 కోట్ల మంది పేర్ల తొలగింపునకు నైతిక బాధ్యత వహిస్తూ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ డిమాండ్‌ చేశారు. ఢిల్లీలో గత 2 రోజులుగా కొనసాగుతున్న నిరసనలను అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పాలడుగు భాస్కర్‌ విమర్శించారు. 57 మెట్రో స్టేషన్లతో పాటు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లను మూసివేయడం, ఉత్తర భారతదేశంలోని పలు రైళ్లను రద్దు చేయడంతో సామాన్య ప్రజలు, కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ముళ్ల కంచెలు, బారికేడ్లు ఏర్పాటు చేయడం, ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేయడం, నిరసనకారులపై బలప్రయోగం చేయడం ప్రజాస్వామ్య హక్కులను హరించడమేనని భాస్కర్‌ అన్నారు. శాంతియుత నిరసనలను నిర్బంధాలతో అడ్డుకోవడం సరికాదని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఢిల్లీ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసినా కేంద్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు రాలేదని విమర్శించారు.

దేశవ్యాప్త పోరాటానికి పిలుపు

జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా చేసేంతవరకు పోరాటాన్ని ఢిల్లీకి పరిమితం చేయకుండా దేశవ్యాప్తంగా విస్తరిస్తామని పాలడుగు భాస్కర్‌ హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను గౌరవించాలని డిమాండ్‌ చేశారు.
ఈ నిరసనకు సీఐటీయూ హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ కార్యదర్శి జె.కుమారస్వామి అధ్యక్షత వహించారు. సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు, రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్‌, జె.మల్లిఖార్జున్‌, రాష్ట్ర కార్యదర్శులు జె.వెంకటేశ్‌, ఎం.వెంకటేశ్‌, కూరపాటి రమేశ్‌, పుప్పాల శ్రీకాంత్‌, పి.సుధాకర్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎ.సునీత, రొయ్యల రాజు, హైదరాబాద్‌ సీఐటీయూ నాయకులు టీ.మహేందర్‌, మరన్న, కృష్ణస్వామి, గోల్కొండ నగర నాయకులు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

దేశ ప్ర‌జ‌లు కాంగ్రెస్‌కు మద్దతివ్వాలి

దేశ ప్ర‌జ‌లు కాంగ్రెస్‌కు మద్దతివ్వాలి ఓట్ల తొలగింపుపై ప్రశ్నిస్తే అరెస్టులా? మోదీ పాలనలో ప్రజాస్వామ్య...

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉచిత సహాయ పరికరాలు

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉచిత సహాయ పరికరాలు ఈ నెల 27, 28,...

సర్వోత్తమరెడ్డి విజయం ఖాయం

సర్వోత్తమరెడ్డి విజయం ఖాయం గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్సే పట్టభద్రుల ఆశయాలను...

కానిస్టేబుల్‌ దిలీప్‌ను పరామర్శించిన గండ్ర

కానిస్టేబుల్‌ దిలీప్‌ను పరామర్శించిన గండ్ర ఆరెపల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు కాకతీయ,...

ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్స్‌ తనిఖీలు

ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్స్‌ తనిఖీలు విమానాశ్రయం నుంచి వస్తున్న వాహనాల్లో మద్యం బాటిళ్ల తనిఖీ రెండు...

గౌరవెల్లి పనులకు వేగం పెంచాలి..

గౌరవెల్లి పనులకు వేగం పెంచాలి.. భూసేకరణ పూర్తి చేసి.. పనులు పరుగులు పెట్టించాలి.. గౌరవెల్లి...

14 కొత్త బార్లకు గ్రీన్‌సిగ్నల్‌

14 కొత్త బార్లకు గ్రీన్‌సిగ్నల్‌ టీసీయూఆర్‌ పరిధిలో ముందస్తు అనుమతులకు ఆహ్వానం కాకతీయ, హైదరాబాద్...

మోయినాబాద్‌ మున్సిపాలిటీలో ఏసీబీ వల

మోయినాబాద్‌ మున్సిపాలిటీలో ఏసీబీ వల ఏసీబీకి చిక్కిన టౌన్‌ ప్లానింగ్‌ అధికారిణి గుండు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.