ఎస్సీ మరియు ఎస్టీలపై కేసుల నమోదుకు ముందు సమగ్ర విచారణ చేయాలి
:డా. పెరుమాండ్ల రామకృష్ణ
కాకతీయ,హైదరాబాద్ : SC/STలకు చెందిన వ్యక్తులపై కేసులు నమోదు చేసే ముందు వాస్తవ పరిస్థితులు, వారి ప్రమేయం, అందుబాటులో ఉన్న ఆధారాలను సమగ్రంగా పరిశీలించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర గౌరవాధ్యక్షులు డా. పెరుమాండ్ల రామకృష్ణ ఐపీఎస్ అధికారి శ్రీ చంద్రశేఖర్ రెడ్డి గారిని కలిసి వినతిపత్రం అందజేశారు. డీజీపీ కార్యాలయంలో ఈ వినతిపత్రాన్ని అందజేశారు.
SC/STలకు చెందిన అమాయకులు అనవసరంగా కేసుల్లో ఇరుక్కోకుండా, కేసు నమోదు చేసే ముందు పూర్తి స్థాయిలో వాస్తవాలను పరిశీలించాలని డా. రామకృష్ణ కోరారు.
ఈ అంశంపై శ్రీ చంద్రశేఖర్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించి, SC/STల విషయంలో వాస్తవ పరిస్థితులను పరిశీలించి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపినందుకు డా. రామకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, రాజ్యసభ సభ్యులు శ్రీ వి. నరేందర్ రెడ్డి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు దళితులు, గిరిజనుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని, అదే సమయంలో కొంతమంది పోలీసు అధికారుల చర్యల వల్ల SC/ST వర్గాలకు చెందిన వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని డా. రామకృష్ణ పేర్కొన్నారు.

