కాకినాడలో ‘రాగా దాండియా ఉత్సవ్ 2.0’
వేగా జ్యువెలర్స్ ఆధ్వర్యంలో అక్టోబరు 18న నవరాత్రి సంబరాలు
ద్వారంపూడి ఫంక్షన్ హాల్లో సాయంత్రం 7 గంటల నుంచి వేడుకలు
బిగ్బాస్ ఫేమ్ ఉదయ్ మాస్టర్ బృందం ప్రత్యేక ప్రదర్శనలు
కాకతీయ, కాకినాడ : కాకినాడ సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా ‘రాగా దాండియా ఉత్సవ్ 2.0’ నిర్వహించనున్నట్లు వేగా జ్యువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ నవీన్ వనమా తెలిపారు. దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా వీ వైబ్ సంస్థ సహకారంతో అక్టోబరు 18న ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి నాగమల్లి తోట జంక్షన్లోని ద్వారంపూడి ఫంక్షన్ హాల్లో వేడుకలు జరగనున్నాయి. నగర ప్రజలకు సంప్రదాయం, సంగీతం, నృత్యాల సమ్మేళనంగా ఈ కార్యక్రమాన్ని అందించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. నగర ప్రముఖులు వనమాడి వెంకటేశ్వరరావు, పంతం వెంకటేశ్వరరావు (పంతం నానాజీ) ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో వేడుకలను ప్రారంభించనున్నారు. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు తారలు, రాజకీయ ప్రముఖులు కూడా పాల్గొననున్నారు. బిగ్బాస్ ఫేమ్ ఉదయ్ మాస్టర్ నేతృత్వంలోని డ్యాన్స్ బృందం ప్రత్యేక ప్రదర్శనలు ఇవ్వనుంది. ఇద్దరు డీజేల సంగీతం, పంజాబీ ఢోల్ వాయిద్యాల నడుమ దాండియా, గర్బా నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
సంప్రదాయానికి ఆధునిక హంగులు
వేడుకలకు వచ్చే అతిథులకు హారతి, తిలకంతో సంప్రదాయ స్వాగతం పలకనున్నారు. ఫుడ్ స్టాళ్లు, మాక్టైల్ కౌంటర్లు, ఫేస్ పెయింటింగ్, రంగురంగుల గాజుల స్టాళ్లు, సంప్రదాయ పోటీలు ఏర్పాటు చేస్తున్నారు. జ్ఞాపకాల కోసం మ్యాగ్నెటిక్ ఫొటో బూత్, సెల్ఫీ పాయింట్లు అందుబాటులో ఉండనున్నాయి. నవరాత్రులు భక్తి, సంప్రదాయం, ఐక్యతకు ప్రతీకలని నవీన్ వనమా పేర్కొన్నారు. కాకినాడ కుటుంబాలు, యువత కలిసి పండుగ స్ఫూర్తిని పంచుకునేలా ఈ వేదికను సిద్ధం చేశామని తెలిపారు. సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుధాకర్ వనమా మాట్లాడుతూ మహిళలు, యువతీయువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకను విజయవంతం చేయాలని కోరారు. 1989 నుంచి నాణ్యత, నమ్మకానికి గుర్తింపుగా నిలిచిన వేగా జ్యువెలర్స్ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

