అంగన్వాడీ సేవలు గర్భిణీలు, బాలింతలు సద్వినియోగించుకోవాలి
కాకతీయ, ఏలూరు ప్రతినిధి : అంగన్వాడీల్లో అందించే సేవలు గర్భిణీలు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని సీడీపీవో బ్యూలా తెలిపారు. మండల కేంద్రంలోని కొండగూడెం 3 అంగన్వాడీ కేంద్రంలో జాతీయ పోషణ మాసం కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీలు, బాలింతలు తీసుకునే ఆహారంతో పాటు జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. విజిలెన్స్ కమిటీ సభ్యులు కారే సాల్మాన్ రాజు అంగన్వాడీ కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో మహిళా పోలీస్ మౌనిక, భారతి సూపర్వైజర్ ఎం విజయలక్ష్మి, అంగన్వాడి కార్యకర్తలు, తల్లులు పాల్గొన్నారు.

