రాష్ట్ర స్థాయి పోటీలకు ఎడవల్లి హైస్కూల్ విద్యార్థులు
కాకతీయ, ఏలూరు ప్రతినిధి : మండలంలోని తూర్పు ఎడవల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. కేపీడీటీ హైస్కూల్లో జరిగిన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా స్థాయి థైక్వాండో సెలక్షన్స్లో వీరు విజయం సాధించి రాష్ట్ర పోటీలకు ఎంపికయ్యారు. అండర్ – 14 బాలికల విభాగంలో 9వ వెయిట్ కేటగిరినందు పంతగాని ప్రియాంక, అండర్ – 17 బాలికల విభాగంలో 4వ వెయిట్ కేటగిలో మానుకొండ వెంకట పావని, 5వ వెయిట్ కేటగిరిలో మరీదు సంధ్యారాణి, 6వ వెయిట్ కేటగిరిలో మానుకొండ భాగ్యశిరీష రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరు వచ్చే నెల 12, 13, 14 తేదీల్లో అనంతపురం జిల్లా, తాడిపత్రి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు జి. రవి తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను హెచ్ఎం కోటేశ్వరి, ఉపాధ్యాయులు అభినందించారు.

