వాల్మీకి బోధనలు సమాజానికి మార్గదర్శకం!
పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో మహర్షి జయంతి వేడుకలు
వరంగల్ పోలీస్ ట్రైనింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ రవీందర్ పులిగిల్ల,
కాకతీయ, వరంగల్: మహర్షి వాల్మీకి బోధనలు సమాజానికి ఎల్లప్పుడూ మార్గదర్శకంగా నిలుస్తాయని వరంగల్ పోలీస్ ట్రైనింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ రవీందర్ పులిగిల్ల, ఐపీఎస్ అన్నారు. మహర్షి వాల్మీకి జయంతిని పురస్కరించుకొని కళాశాలలో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొని, వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా రవీందర్ పులిగిల్ల మాట్లాడుతూ.. మహర్షి వాల్మీకి రచించిన రామాయణం మానవాళికి నీతి, ధర్మం, సత్యనిష్ఠతో పాటు ఆదర్శ జీవన విలువలను అందించిందన్నారు. ఆయన బోధనలను ఆచరించడం ద్వారా సమాజంలో నైతిక విలువలను పెంపొందించుకోవచ్చని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీలు కే. రవీందర్, విజయ్‌కుమార్, ఆర్ఐ కే. నగేష్, టి. చంద్రశేఖర్‌తో పాటు కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.

