సుద్దముక్కలతో సూక్ష్మ కళాఖండాలు
అబ్బురపరిచిన జక్కనపల్లి రాము కళానైపుణ్యం
అంతర్జాతీయ ఇంటర్నెట్ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆకర్షణ
ఇంటర్నెట్ను సద్వినియోగం చేసుకోవాలి: సూక్ష్మ కళాకారుడు రాము
కాకతీయ, చేర్యాల: సుద్దముక్కలతో అతి చిన్న పరిమాణంలో కంప్యూటర్, సీపీయూ, కీబోర్డ్, మౌస్, మొబైల్ ఫోన్లను రూపొందించి సూక్ష్మ కళాకారుడు జక్కనపల్లి రాము తన ప్రతిభను చాటుకున్నారు. అంతర్జాతీయ ఇంటర్నెట్ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా చేర్యాలలో ఆయన రూపొందించిన కళాఖండాలు ఆకట్టుకున్నాయి. ఇంటర్నెట్ ద్వారా విద్య, వైద్యం, విజ్ఞానం, వ్యాపార రంగాల్లో ఎంతో సమాచారం పొందవచ్చని రాము తెలిపారు. అయితే ఇంటర్నెట్కు బానిసలై విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దని సూచించారు. సాంకేతికతను సద్వినియోగం చేసుకుని భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందేశాన్ని చాటిచెప్పేందుకే తన సూక్ష్మ కళారూపాలను ఇంటర్నెట్ అభిమానులకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు. ఆయన కళానైపుణ్యాన్ని పలువురు అభినందించారు.


