వెంకటసాయి ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స!
3.75 కిలోల భారీ గర్భాశయ ఫైబ్రాయిడ్ తొలగింపు
డాక్టర్ కృష్ణ శ్రావ్య కు అభినందనలు వెల్లువ
కాకతీయ,చేర్యాల : వైద్య రంగంలో తనదైన ప్రత్యేకతను చాటుకుంటూ చేర్యాల పట్టణంలోని వెంకటసాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అరుదైన శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. ఆసుపత్రికి చెందిన డాక్టర్ కృష్ణ శ్రావ్య 3.75 కిలోల భారీ గర్భాశయ ఫైబ్రాయిడ్ను శస్త్రచికిత్స ద్వారా తొలగించారు. ప్రస్తుతం రోగి ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్ గోపాల్ రెడ్డి తెలిపారు.భారీ ఫైబ్రాయిడ్తో బాధపడుతున్న చేర్యాల మండలానికి చెందిన ఓ మహిళ ఆసుపత్రిలో చేరగా, వైద్య పరీక్షల అనంతరం గురువారం శస్త్రచికిత్స నిర్వహించి ఫైబ్రాయిడ్ను తొలగించినట్లు వెల్లడించారు. శస్త్రచికిత్స అనంతరం రోగి ఆరోగ్యం నిలకడగా ఉండటంతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. వైద్యులకు, ఆసుపత్రి సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతూ అభినందనలు తెలిపారు.మహిళల ఆరోగ్య సమస్యలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా వెంకటసాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పనిచేస్తోందని డాక్టర్ గోపాల్ రెడ్డి పేర్కొన్నారు. అనుభవజ్ఞులైన వైద్యులు, ఆధునిక వైద్య విధానాలతో చేర్యాల ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. భారీ గర్భాశయ ఫైబ్రాయిడ్ను విజయవంతంగా తొలగించడం ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వైద్య నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచిందని పేర్కొన్నారు.

