epaper
Monday, November 2, 2026
epaper
BREAKING NEWS
Loading News...

గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ ప్రెస్ క్ల‌బ్‌ను రద్దు చేయాలి

గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ ప్రెస్ క్ల‌బ్‌ను రద్దు చేయాలి
కాలం చెల్లిన క‌మిటీకి కొన‌సాగే అర్హ‌త లేదు
రెండేళ్లుగా ఎన్నికలు నిర్వహించకపోవడం విచారకరం
ప్రస్తుత కమిటీని రద్దు చేసి తక్షణమే ఎన్నికలు పెట్టాలి
ఎన్నికల నిర్వహణకు అడ్వైజరీ కమిటీ ప్రకటించాలి
బైలా పేరుతో కాలయాపన చేస్తే సహించేది లేదు
దశలవారీగా ఆందోళనలు చేప‌డుతాం
సోమ‌వారం వ‌రంగ‌ల్‌, హ‌న్మ‌కొండ జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు
టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీఆర్‌ లెనిన్‌
ప్ర‌జాస్వామ్య‌యుతంగా పోరాడాలి : టీడీఎంయూ రాష్ట్ర అధ్య‌క్షుడు అరెల్లి కిర‌ణ్ గౌడ్

కాకతీయ, హనుమకొండ : గ్రేటర్‌ వరంగల్‌ ప్రెస్‌క్లబ్‌ ప్రస్తుత కమిటీని వెంటనే రద్దు చేసి ఎన్నికలు నిర్వహించాలని టీయూడబ్ల్యూజే (హెచ్‌–143) రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీఆర్‌ లెనిన్‌ డిమాండ్‌ చేశారు. కమిటీ పదవీకాలం ముగిసి రెండేళ్లు గడుస్తున్నా ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేయడం సరైంది కాదన్నారు. ఎన్నికలు జరిపే వరకు యూనియన్‌ తరఫున దశలవారీగా ఉద్యమాలు చేపడతామని స్పష్టం చేశారు. హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్‌లో నిర్వహించిన యూనియన్‌ సమావేశంలో లెనిన్‌ మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణ కోసం వెంటనే అడ్వైజరీ కమిటీని ప్రకటించాలని, రెండు జిల్లాల యూనియన్‌ నేతల ద్వారా స్టీరింగ్‌ కమిటీ సభ్యులను నియమించాలని కోరారు. పాత బైలాను అనుసరించి ఎన్నికైన కమిటీ, ఇప్పుడు అదే బైలాను విస్మరించడం అనైతికమన్నారు. బైలా కమిటీ పేరుతో కాలయాపన చేయడం కుదరదని, ప్రస్తుత బైలా కమిటీని తమ యూనియ‌న్ తిర‌స్క‌రిస్తున్న‌ట్లు స్పష్టం చేశారు. అందులో ఉన్న యూనియన్‌ నేతలు వైదొలగుతారని తెలిపారు. సోమవారం గ్రీవెన్స్‌లో వరంగల్‌, హనుమకొండ కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేస్తామని లెనిన్‌ చెప్పారు. గత ఎన్నికల్లో ప్రెస్‌క్లబ్‌ కమిటీలో సభ్యులుగా నియమితులైన యూనియన్‌ సభ్యులతో అత్యవసర సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. ఎన్నికల నిర్వహణ కోసం చేపట్టే ఉద్యమంలో సభ్యులంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ప్ర‌జాస్వామ్య‌యుతంగా పోరాడాలి : టీడీఎంయూ రాష్ట్ర అధ్య‌క్షుడు అరెల్లి కిర‌ణ్ గౌడ్

టీడీఎంయూ రాష్ట్ర అధ్య‌క్షుడు అరెల్లి కిర‌ణ్ గౌడ్ మాట్లాడుతూ కాల‌ప‌రిమితి ముగిసినా ప్రెస్‌క్ల‌బ్ ఎన్నిక‌ల‌కు వెళ్ల‌క‌పోవ‌డం అనైతిక‌మ‌ని అన్నారు. క‌మిటీ ప‌ద‌వికాలం ఇప్ప‌టికే ఏడాదిన్న‌ర కాలం పూర్త‌యినా వివిధ కార‌ణాల‌తో కొన‌సాగాల‌ని చూడ‌టం ఆక్షేప‌ణీయ‌మ‌న్నారు. ఈ నేప‌థ్యంలోనే ప్రెస్ క్ల‌బ్ క‌మిటీలో ఉన్న‌ టీయూడబ్ల్యూజే (హెచ్‌–143) యూనియ‌న్ నేత‌లు ముందుగా కార్య‌వ‌ర్గం నుంచి వైదొల‌గుతూ..ప‌ద‌వుల‌కు రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశారు. వ‌రంగ‌ల్ ప్రెస్ క్ల‌బ్ స‌భ్యులు ప్ర‌జాస్వాయ్య‌యుత ప‌ద్ధ‌తిలోనే నిర‌స‌న‌, పోరాటాలు చేప‌ట్టాల‌ని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి తడక రాజనారాయణ, డెస్క్‌ జర్నలిస్టుల కన్వీనర్‌ శంకేసి శంకర్‌రావు, రాష్ట్ర నేతలు చిలుముల సుధాకర్‌, కక్కెర్ల అనిల్‌కుమార్‌, పొగాకుల అశోక్‌, దొంతు నవీన్‌, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు మస్కాపురి సుధాకర్‌, కార్యదర్శి హర్షం రాజ్‌కుమార్‌, హనుమకొండ ఎలక్ట్రానిక్‌ మీడియా జిల్లా అధ్యక్షుడు భూరం ప్రశాంత్‌, కార్యదర్శి తాళ్లపల్లి వేణుగోపాల్‌, వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు నరేందర్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా అధ్యక్షుడు నవనీత్‌, ప్రెస్‌క్లబ్‌ ఉపాధ్యక్షులు గోకారపు శ్యామ్‌కుమార్‌, బొడిగె శ్రీను, ఈసీ సభ్యులు కమటం వేణుగోపాల్‌, శ్రీకాంత్‌, తెలంగాణ డిజిటల్‌ మీడియా యూనియన్‌ అధ్యక్షుడు అరెల్లి కిరణ్‌, కార్యదర్శి నాగరాజు, కెమెరామెన్‌ అధ్యక్షుడు చందు, బండి రవి, అమీర్‌, మునీర్‌, ఎస్‌.హరి, యుగేందర్‌, సంతోష్‌, విజయ్‌, ప్రభాకర్‌, అనిల్‌, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పేదల గుడిసెలు కూల్చడమే ఇందిరమ్మ రాజ్యమా?

  పేదల గుడిసెలు కూల్చడమే ఇందిరమ్మ రాజ్యమా? వైఎస్సార్‌ నగర్‌ వాసులకు వెంటనే పట్టాలు...

పేదల గుడిసెల జోలికొస్తే ఊరుకునేది లేదు!

పేదల గుడిసెల జోలికొస్తే ఊరుకునేది లేదు! వైఎస్సార్‌ నగర్‌ వాసులకు అండగా ఉంటా 30...

పెద్దవంగరను కరువు మండలంగా ప్రకటించాలి.

పెద్దవంగరను కరువు మండలంగా ప్రకటించాలి. బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య,మండల నాయకుల...

యూరిన్ టెస్టులతో గంజాయి వినియోగదారుల గుర్తింపు.. ముగ్గురు పట్టివేత

యూరిన్ టెస్టులతో గంజాయి వినియోగదారుల గుర్తింపు.. ముగ్గురు పట్టివేత THC ఆనవాళ్లు గుర్తించిన...

ఏక్తా దివస్‌ 5కే, 10కే రన్‌లో ఉత్సాహంగా పాల్గొన్న ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు..

ఏక్తా దివస్‌ 5కే, 10కే రన్‌లో ఉత్సాహంగా పాల్గొన్న ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు.. కాకతీయ,...

మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి నల్ల బ్యాడ్జీలు ధరించి ఉపాధ్యాయుల నిరసన కాకతీయ,శంకరపట్నం:మోడల్...

రాష్ట్రస్థాయి క్రీడా జట్లకు చేర్యాల గురుకుల విద్యార్థులు!

రాష్ట్రస్థాయి క్రీడా జట్లకు చేర్యాల గురుకుల విద్యార్థులు! * కబడ్డీ, వాలీబాల్‌తో పాటు...

ప్రజా సమస్యలపై ప్రశ్నల వర్షం!

ప్రజా సమస్యలపై ప్రశ్నల వర్షం! * ముస్త్యాల రైతు వేదికలో సర్వసభ్య సమావేశం.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.