epaper
Tuesday, November 3, 2026
epaper
BREAKING NEWS
Loading News...

అర్హులైన పట్టభద్లందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి!

అర్హులైన పట్టభద్లందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి!
నవంబర్‌ 6తో ఓటరు నమోదు గడువు ముగింపు
ప్రతి పట్టభద్రుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
కుటుంబ సభ్యులు, స్నేహితులనూ నమోదు చేయించాలి
ఏటా మళ్లీ నమోదు చేసుకునే విధానానికి స్వస్తి పలకాలి
ఓటరు జాబితాలో శాశ్వత నమోదు విధానం రావాలి
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై మధుసూదనాచారి పిలుపు
కాకతీయ, హ‌న్మ‌కొండ‌ : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ నవంబర్‌ 6లోగా ఓటరుగా నమోదు చేసుకోవాలని శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి పిలుపునిచ్చారు. ఒక్క అర్హుడి పేరు కూడా ఓటరు జాబితాలో చేరకుండా మిగలకూడదని, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో పాటు తమ ప్రాంతంలోని పట్టభద్రులందరినీ నమోదు చేయించే బాధ్యత తీసుకోవాలని కోరారు. వరంగల్‌లో బీఆర్‌ఎస్‌వీ కోఆర్డినేటర్‌ బైరపాక ప్రశాంత్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల, ఏవీవీ డిగ్రీ, పీజీ కళాశాల, లాల్‌ బహదూర్‌ కళాశాలల్లో నిర్వహించిన అవగాహన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. పట్టభద్రతకు సంబంధించిన ధ్రువీకరణ పత్రం, ఫొటో, గుర్తింపు పత్రాలతో ఓటరుగా నమోదు చేసుకోవచ్చని మధుసూదనాచారి తెలిపారు. ఎన్నికల సంఘం ఆమోదించిన గుర్తింపు పత్రాలను వినియోగించుకోవాలని, ఆన్‌లైన్‌లోనూ నమోదు ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చన్నారు. చివరి తేదీ కోసం వేచి చూడకుండా అర్హులంతా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఏటా నమోదు విధానంలో మార్పు రావాలి
ఒకసారి అర్హత సాధించి ఓటరుగా నమోదైన వారి పేర్లు నిరంతరం జాబితాలో కొనసాగే విధానం ఉండాలని మధుసూదనాచారి అభిప్రాయపడ్డారు. కొత్తగా అర్హత పొందిన పట్టభద్రుల పేర్లను చేర్చి, మరణించిన లేదా అర్హత కోల్పోయిన వారి పేర్లను తొలగించేలా విధానం రూపొందించాలన్నారు. ప్రతి ఎన్నికల సమయంలో మళ్లీ నమోదు చేసుకోవాల్సిన పరిస్థితిని మార్చాలని, ఈ అంశంపై భారత ఎన్నికల సంఘానికి సమగ్ర ప్రాతినిధ్యం సమర్పిస్తానని వెల్లడించారు. శాసనమండలి పునరుద్ధరణకు సంబంధించిన చరిత్రను ప్రస్తావిస్తూ, 2007లో బిల్లు ఆమోదం పొందిన అనంతరం 2008లో మండలి పునరుద్ధరించబడిందని తెలిపారు. ప్రజాస్వామ్యంలో వివిధ వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించే శాసనమండలిలో పట్టభద్రుల గొంతుక వినిపించేందుకు ఈ నియోజకవర్గం కీలకమన్నారు. కార్యక్రమాల్లో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌ భాస్కర్‌, మాజీ కుడా చైర్మన్‌ యాదవరెడ్డి, రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ దినేష్‌, మాజీ కార్పొరేటర్లు వద్దిరాజు గణేశ్‌, రమేష్‌, మసూద్‌, పార్టీ సీనియర్‌ నాయకులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వ‌రికి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి!

వ‌రికి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి! జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల కాకతీయ, గీసుగొండ...

పట్టా భూమి కబ్జాకు యత్నం

పట్టా భూమి కబ్జాకు యత్నం 2006 లో కొనుగోలు చేసి పట్టా చేపించుకున్న  అధికారులు...

పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలి

పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలి న్యాయవాదులు, అధ్యాపకులు, యువత ఎన్నికల్లో భాగస్వాములు కావాలి సర్వోత్తమ్‌రెడ్డిని...

ప్రజల భద్రత కోసం పోరాడితే కేసులా?

ప్రజల భద్రత కోసం పోరాడితే కేసులా? భారీ వాహనాల నియంత్రణ కోరుతూ నిరసన...

కరెంట్‌ కోతల పాపం రేవంత్‌రెడ్డిదే!

కరెంట్‌ కోతల పాపం రేవంత్‌రెడ్డిదే! దేవాదుల పంపులు ఎందుకు ఆన్‌ చేయలేదు? ప్రభుత్వంపై మాజీ...

గంజాయి కేసులో పరారీలో ఉన్న నిందితుడి అరెస్ట్‌!

గంజాయి కేసులో పరారీలో ఉన్న నిందితుడి అరెస్ట్‌! కాకతీయ, నెల్లికుదురు : గంజాయి,...

కార్యకర్తల జోలికొస్తే సహించేది లేదు!

కార్యకర్తల జోలికొస్తే సహించేది లేదు! కార్యకర్తల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధం బీఆర్ఎస్ నేత‌ల‌పై...

నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల భృతి ఇవ్వాలి!

నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల భృతి ఇవ్వాలి! ఎన్నికల హామీని అమలు చేయడంలో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.