epaper
Tuesday, November 3, 2026
epaper
BREAKING NEWS
Loading News...

చిట్టీ సొమ్ముకు చిల్లర భూములు

చిట్టీ సొమ్ముకు చిల్లర భూములు
రూ.2 లక్షల ప్లాటు.. రూ.20 లక్షల లెక్క!
నగదుకు బదులుగా అనుబంధ సంస్థల ప్లాట్ల పంపిణీ
బాధితుల సమ్మతి లేకుండానే మోస‌పూరితంగా రిజిస్ట్రేషన్ల ప్ర‌క్రియ‌
వాస్తవ మార్కెట్‌ ధరకు.. దస్తావేజుల్లోని విలువకు పొంతనేది?
వ‌రంగ‌ల్ కేంద్రంగా సాగిన చిట్ ఫండ్ కంపెనీల ఆర్థిక‌ మోసాలు
ఇప్ప‌టికే ఐదు సంస్థలపై ఆర్థిక నేరాల కేసులు.. బ్లాక్‌లిస్టులో కంపెనీలు
అక్షర, కనకదుర్గ, అచ‌ల‌ నుంచి కొందరికే పాక్షిక చెల్లింపులు
పూర్తిగా మొహం చాటేసిన శుభనందిని, భవితశ్రీ యాజ‌మాన్యాలు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : రూ.2 లక్షలు కూడా పలకని ప్లాటు.. రూ.20 లక్షల విలువగా లెక్క! చిట్టీల రూపంలో ప్రజల నుంచి వసూలు చేసిన సొమ్మును తిరిగి చెల్లించాల్సిన సమయంలో నగదుకు బదులుగా తక్కువ విలువ చేసే భూములను అంటగట్టినట్లు ఆరోపణలు! బాధితులతో పూర్తిస్థాయిలో చర్చించకుండానే, వారి సమ్మతి తీసుకోకుండానే రిజిస్ట్రేషన్లు చేసినట్లు ఫిర్యాదులు ఉండ‌టం..! ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కొన్ని చిట్‌ఫండ్‌ సంస్థల వ్యవహారాలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి. చీటీలు పూర్తయినా డబ్బులు చెల్లించలేని సంస్థలు.. తమ అనుబంధ రియల్‌ ఎస్టేట్‌ సంస్థల ప్లాట్లను భారీ ధరలకు లెక్కగట్టి బాధితుల ఖాతాలను సెటిల్ చేశాయి. పట్టణానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాల్లో కనీసం రూ.2 లక్షలు కూడా విలువ చేయని ప్లాట్లకు రూ.20 లక్షల ధర కట్టి రిజిస్ట్రేషన్లు చేసినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిట్టీ సొమ్ము కోసం వెళ్తే భూములు అంటగట్టి, పైగా ఇక ఎలాంటి బకాయిలు లేవని చెబుతున్నారని వాపోతున్నారు. ఎవ‌రూ కొన‌డానికి కూడా ముందుకు రావ‌డం లేదని గుండెల నిండా బాధ‌తో చెబుతున్నారు. ఒకవైపు ప్రజల కష్టార్జితంతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు విస్తరించగా.. మరోవైపు చెల్లింపుల సంక్షోభం తలెత్తడంతో సంస్థల అసలు వ్యవహారాలు బయటపడుతున్నాయి.
భారీగా విలువల మాయ!
చిట్టీలు పూర్తయిన తర్వాత సభ్యులకు చెల్లించాల్సిన మొత్తాన్ని నగదు రూపంలో ఇవ్వకుండా, అనుబంధ రియల్‌ ఎస్టేట్‌ సంస్థల్లోని ప్లాట్లను కేటాయించినట్లు బాధితులు చెబుతున్నారు. మొదట తమకు రావాల్సిన చిట్టీ మొత్తానికి సమానమైన విలువ కలిగిన ప్లాట్లు ఇస్తామని నమ్మించి, ఆ తర్వాత వాటి విలువను భారీగా చూపించినట్లు ఆరోపిస్తున్నారు. వాస్తవంగా రూ.2 లక్షలు కూడా పలకని భూములకు రూ.20 లక్షల ధర నిర్ణయించి రిజిస్ట్రేషన్లు చేసినట్లు కొందరు బాధితులు పేర్కొంటున్నారు. చిట్టీ మొత్తాన్ని ప్లాటు విలువ నుంచి మినహాయించడమే కాకుండా, మిగిలిన మొత్తాన్ని కూడా తమ నుంచి వసూలు చేసినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. పట్టణానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాల్లో ప్లాట్లు కేటాయించడంతో వాటి వాస్తవ మార్కెట్‌ విలువపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రిజిస్ట్రేషన్‌ దస్తావేజుల్లో పేర్కొన్న ధరకు, క్షేత్రస్థాయిలో ఆ భూములకు ఉన్న ధరకు మధ్య భారీ వ్యత్యాసం ఉందని బాధితులు చెబుతున్నారు.
సమ్మతి లేకుండానే రిజిస్ట్రేషన్లు?
ప్లాట్ల కేటాయింపు వ్యవహారంలో బాధితులు చేస్తున్న మరో ఆరోపణ మరింత తీవ్రమైంది. కేవలం భరోసా కోసమే కొన్ని పత్రాలపై సంతకాలు చేయాలని, ప్లాట్లు తమ ఆధీనంలోకి వస్తాయని, తమ ఇష్టానికి వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకోబోమని సంస్థల ప్రతినిధులు నమ్మించినట్లు బాధితులు చెబుతున్నారు. అయితే ఆ పత్రాల ఆధారంగా తమ పూర్తి సమ్మతి లేకుండానే సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ఫిర్యాదు చేస్తున్నారు. తమకు ఏ ప్లాటు కేటాయించారు? అది ఎక్కడ ఉంది? దాని విస్తీర్ణం ఎంత? వాస్తవ విలువ ఎంత? అనే వివరాలు పూర్తిగా తెలియకుండానే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయిందని వాపోతున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే.. మీ చిట్టీ మొత్తానికి ఆ ప్లాటు విలువ సరిపోతుందని, ఇక మీకు ఎలాంటి బకాయిలు లేవని సంస్థల ప్రతినిధులు చెబుతున్నట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో సంతకాలు చేసిన పత్రాల స్వరూపం, వాటి ఆధారంగా జరిగిన రిజిస్ట్రేషన్లు, బాధితులకు అందించిన వివరాలు కీలకంగా మారాయి. రిజిస్ట్రేషన్‌ సమయంలో బాధితుల సమ్మతిని ఎలా నిర్ధారించారు? ఏ పత్రాల ఆధారంగా లావాదేవీలు పూర్తయ్యాయి? ప్లాట్ల కేటాయింపునకు ముందు వాటి విలువను ఎవరు నిర్ణయించారు? అనే అంశాలపై దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది.
బ్లాక్‌లిస్టులో కంపెనీలు
చిట్‌ఫండ్‌ సంస్థల నుంచి తమకు రావాల్సిన డబ్బులు ఇప్పించాలంటూ బాధితులు పలుమార్లు ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టారు. కార్యాలయాల చుట్టూ తిరుగుతూ చెల్లింపులు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో అక్షర, కనకదుర్గ, శుభనందిని, అచల, భవితశ్రీ తదితర సంస్థల వ్యవహారాలపై ఆర్థిక నేరాల కింద కేసులు నమోదైనట్లు సమాచారం. ప్రభుత్వం ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి ఆయా సంస్థలను బ్లాక్‌లిస్టులో చేర్చినట్లు తెలుస్తోంది. అయితే కేసులు నమోదు కావడం, బ్లాక్‌లిస్టులో చేర్చడం మాత్రమే బాధితులకు న్యాయం జరిగినట్లు కాదని వారు అంటున్నారు. తమకు రావాల్సిన అసలు సొమ్ము, దానిపై చెల్లించాల్సిన మొత్తాలను తిరిగి ఇప్పించే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సంస్థల ఆర్థిక లావాదేవీలు, ఆస్తుల వివరాలు, బాధితుల బకాయిలపై సమగ్ర లెక్కలు బయటపెట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు.
అక్షర, కనకదుర్గ, అచల నుంచి పాక్షిక చెల్లింపులే!
ప్రభుత్వం ఈ వ్యవహారంపై సీరియస్‌గా వ్యవహరించడంతో అక్షర చిట్‌ఫండ్‌ సంస్థ నుంచి ప్రస్తుతం కొంతమంది బాధితులకు పాక్షిక చెల్లింపులు జరుగుతున్నట్లు సమాచారం. కనకదుర్గ సంస్థ నుంచి కూడా ఇటీవల కొందరికి నగదు అందినట్లు తెలుస్తోంది. అచల సంస్థ నుంచి కూడా కొందరికి పరిమితంగా చెల్లింపులు జరిగినట్లు బాధితుల సమాచారం. అయితే ఈ చెల్లింపులు కొద్దిమందికే పరిమితమయ్యాయని, బాధితులందరికీ పూర్తిస్థాయిలో సొమ్ము అందలేదని తెలుస్తోంది. ఒక్కో సంస్థ వద్ద ఎంతమంది బాధితులు ఉన్నారు? వారికి మొత్తం ఎంత బకాయి ఉంది? ఇప్పటివరకు ఎంత చెల్లించారు? ఇంకా ఎంత చెల్లించాల్సి ఉంది? అనే వివరాలను అధికారికంగా వెల్లడించాల్సిన అవసరం ఉంది. కొందరికి మాత్రమే చెల్లింపులు చేసి మిగిలిన వారిని నిరీక్షణలో ఉంచుతున్నారా? చెల్లింపులకు ఏదైనా నిర్దిష్ట ప్రణాళిక ఉందా? అన్న ప్రశ్నలకు సంబంధిత సంస్థలు, అధికారులు సమాధానం చెప్పాల్సి ఉంది.
శుభనందిని, భవితశ్రీ యాజమాన్యాల నుంచి స్పందనేదీ?
మరోవైపు శుభనందిని, భవితశ్రీ సంస్థల నుంచి బాధితులకు చెల్లింపులు జరగడం లేదని, యాజమాన్యాలు పూర్తిగా ముఖం చాటేశాయని బాధితులు చెబుతున్నారు. తమ సొమ్ము కోసం కార్యాలయాల చుట్టూ తిరిగినా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిట్టీలు పూర్తయిన తర్వాత చెల్లించాల్సిన మొత్తాలపై స్పష్టమైన సమాచారం ఇవ్వడం లేదని, బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారో కూడా చెప్పడం లేదని వాపోతున్నారు. ఈ రెండు సంస్థల వద్ద బాధితుల సంఖ్య ఎంత? వారికి చెల్లించాల్సిన మొత్తం ఎంత? సంస్థల పేర్లపై, అనుబంధ సంస్థల పేర్లపై ఉన్న ఆస్తుల వివరాలేమిటి? అన్నది తేలాల్సి ఉంది. యాజమాన్యాల నుంచి వివరణ తీసుకుని, చెల్లింపులు నిలిచిపోవడానికి గల కారణాలను అధికారులు వెల్లడించాల్సిన అవసరం ఉంది.
బాధితుల కష్టార్జితం ఎక్కడికి వెళ్లింది?
చిట్టీల రూపంలో ప్రజలు నమ్మి పెట్టిన కష్టార్జితం.. చివరకు తక్కువ విలువ చేసే ప్లాట్ల రూపంలో మిగిలిపోవాలా? బాధితుల పూర్తి సమ్మతి లేకుండానే రిజిస్ట్రేషన్లు జరిగినట్లు వస్తున్న ఫిర్యాదులపై విచారణ ఎప్పుడు పూర్తవుతుంది? ఆర్థిక నేరాల కేసుల్లో దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? బ్లాక్‌లిస్టులో ఉన్న సంస్థల ఆస్తులను గుర్తించి బాధితులకు బకాయిలు చెల్లించే చర్యలు ఎప్పుడు చేపడతారు? అనే ప్రశ్నలు ఇప్పుడు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. చిట్‌ఫండ్‌ సంస్థల ఆర్థిక లావాదేవీలు, అనుబంధ రియల్‌ ఎస్టేట్‌ సంస్థల ఆస్తులు, రిజిస్ట్రేషన్‌ దస్తావేజులు, బాధితుల సమ్మతి పత్రాలపై సమగ్ర విచారణ జరిగితేనే ఈ వ్యవహారంలో అసలు లెక్కలు బయటపడనున్నాయి. చిట్టీల ద్వారా సేకరించిన సొమ్ము ఏయే ఖాతాలకు వెళ్లింది? ఏయే భూముల కొనుగోళ్లకు వినియోగించారు? సంస్థల పేర్లపై, అనుబంధ సంస్థల పేర్లపై ఉన్న ఆస్తుల విలువ ఎంత? అనే అంశాలను వెలికితీయాలి. బాధితులకు న్యాయం జరగాలంటే కేవలం కేసులు నమోదు చేయడం, సంస్థలను బ్లాక్‌లిస్టులో చేర్చడం సరిపోదు. వారి సొమ్ము ఎక్కడికి వెళ్లిందో గుర్తించి, చట్టపరమైన చర్యల ద్వారా బకాయిలు తిరిగి ఇప్పించే దిశగా అధికారులు ముందడుగు వేయాలి.
బాధితుల‌కు న్యాయం చేయ‌డానికి ప్ర‌య్న‌తిస్తున్నాం
– త‌స్లీమా, వ‌రంగ‌ల్ చిట్ ఫండ్ రిజిస్ట్రార్‌
బాధితుల‌కు న్యాయం చేయ‌డానికి  మా వంతు ప్ర‌య‌త్నం చేస్తున్నాం. ప్ర‌తీ రెండో శుక్ర‌వారం రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యంలోనే గ్రీవెన్స్ నిర్వ‌హిస్తూ  బాధితుల నుంచి నేరుగా ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తున్నాం. ప్ర‌స్తుత‌మైతే కేసులైన సంస్థ‌ల‌ను ప్ర‌భుత్వం బ్లాక్ లిస్టుల్లో చేర్చింది. వాటి ఆస్తుల‌ను కూడా అటాచ్ చేసింది. ఎఫ్‌డీ అమౌంట్ల‌ను డ్రా చేయ‌కుండా.. రిజిస్ట్రార్‌తో జాయింట్ అకౌంట్ ఏర్పాటు చేశారు. కొత్త‌గా చిట్‌ఫండ్ కంపెనీల‌కు ఎన్‌రోల్‌మెంట్‌పై అనేక జాగ్ర‌త్తలు తీసుకుంటున్నాం. ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు నెల‌ల కాలంలో ఎలాంటి కొత్త చిట్ఫండ్ కంపెనీల‌కు అనుమ‌తి ఇవ్వ‌లేదు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సమస్యలు తీరేదెప్పుడు?..

సమస్యలు తీరేదెప్పుడు?.. ఉద్యోగుల గళం వినేదెవరు? పెండింగ్‌ సమస్యల పరిష్కారంపై ఉద్యోగుల్లో ఎదురుచూపులు రెండో వేతన...

మరో వెలుగుమట్లగా వైఎస్సార్‌ నగర్‌!

మరో వెలుగుమట్లగా వైఎస్సార్‌ నగర్‌! మూడు దశాబ్దాలుగా గుడిసెల్లో బతుకులు ఇప్పుడు ఖాళీ చేయాలంటూ ...

జోరందుకోనున్న తెలంగాణ జనసేన!

జోరందుకోనున్న తెలంగాణ జనసేన! సంస్థాగత బలోపేతమే లక్ష్యంగా ‘అలయ్‌ బలాయ్‌’ పట్టభద్రుల ఎమ్మెల్సీ నుంచి...

ఎల్‌నినోను ఎదుర్కొంటాం

ఎల్‌నినోను ఎదుర్కొంటాం విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు రానివ్వం! డిమాండ్‌కు అనుగుణంగా పంపిణీ వ్యవస్థ బలోపేతం ఎన్‌పీడీసీఎల్‌...

పేదలకు ఇళ్లు.. రైతులకు రహదారులు

పేదలకు ఇళ్లు.. రైతులకు రహదారులు రెండో విడతలో మరో 1,100 ఇందిరమ్మ ఇళ్లు పొలాల...

తుమ్మిడిహెట్టిపై మ‌హారాష్ట్ర సానుకూలం!

తుమ్మిడిహెట్టిపై మ‌హారాష్ట్ర సానుకూలం! 152 మీటర్ల ఎత్తు ప్రతిపాదనపై పునఃపరిశీలనకు సీఎం ఫ‌డ్న‌వీస్‌...

మెడికవర్‌పై ఉన్న శ్రద్ధ.. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులపై ఏదీ?

మెడికవర్‌పై ఉన్న శ్రద్ధ.. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులపై ఏదీ? 17 వేల మంది ఉద్యోగుల...

కాంగ్రెస్‌ తెచ్చిన కరువు!

కాంగ్రెస్‌ తెచ్చిన కరువు! దేవాదుల, కల్వకుర్తి నుంచి ఎందుకు నీళ్లు ఎత్తడం లేదు? తమ్మిడిహట్టి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.