మట్టి అక్రమ రవాణాపై పోలీసుల కొరడా!
వాహనాలపై కేసులు నమోదు : ఎస్‌ఐ అపూర్వారెడ్డి
కాకతీయ, చేర్యాల: మండలంలోని చుంచనకోట గ్రామంలో అక్రమ మట్టి రవాణాపై పోలీసులు చర్యలు చేపట్టారు. మట్టి లోడ్‌తో ఉన్న ఒక టిప్పర్, మూడు ట్రాక్టర్లను గుర్తించి వాటిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ అపూర్వారెడ్డి తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్వకాలు చేపట్టినా, అక్రమంగా రవాణా చేసినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

