కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు
బురహాన్ పల్లిలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్
కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న 20 కుటుంబాలు
కాకతీయ, రాయపర్తి/ పాలకుర్తి : మండలంలోని బురహాన్ పల్లి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది.బుధవారం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.సుమారు 20 కుటుంబాలు గ్రామ సర్పంచ్ సూదుల ఉమాదేవి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.పాలకుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి చేరిన నాయకులకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీని నమ్మి వచ్చిన ప్రతి నాయకుడికి,కార్యకర్తకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.పాలకుర్తి నియోజకవర్గాన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కార్యకర్తలు,నాయకులు కృషి చేయాలని ఎమ్మెల్యే కోరారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు,సర్పంచ్ లు,స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు.

