లక్ష్మీపురంలో వైకుంఠధామం ప్రారంభం
పేదలు, బడుగు బలహీన వర్గాల అభివృద్ధే లక్ష్యం
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యం
డీసీసీ అధ్యక్షుడు భూక్య ఉమా మురళి నాయక్
కాకతీయ, ఇనుగుర్తి: పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని డీసీసీ అధ్యక్షుడు భూక్య ఉమా మురళి నాయక్ అన్నారు. శుక్రవారం మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన వైకుంఠధామాన్ని మాజీ డీసీసీ అధ్యక్షుడు భరత్ చందర్‌రెడ్డి, గ్రామ సర్పంచ్ ముదిరెడ్డి కళావతి, శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టినప్పుడే మండలం, జిల్లా, రాష్ట్రం అభివృద్ధి చెందుతాయని నాయకులు పేర్కొన్నారు. పేదలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి రమేష్, గ్రామ కార్యదర్శి మణిదీప్, నాయకులు సత్యపాల్‌రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు బానోతు వీరన్న నాయక్, మాజీ మండల అధ్యక్షులు రామ్‌రెడ్డి, ప్రభాకర్‌గౌడ్, సీనియర్ నాయకుడు ప్రకాశ్‌రెడ్డి, గ్రామ ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, వెంకట్‌రెడ్డి, భూక్యాలాలు, ముత్యాల వెంకన్న, లచ్చయ్య, బాణాల వెంకన్న, తేజాతు పరమేష్, యాకూబ్‌రెడ్డి, బిక్షం, చంద్రారెడ్డి, చిన్న వెంకన్న, కాలేరు శివాజీ తదితరులు పాల్గొన్నారు.

