epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

భారత్‌కు నీరవ్‌మోదీ అప్పగింతకు లైన్ క్లియర్.!!

కాకతీయ, నేషనల్ డెస్క్: పంజాబ్ నేషనల్ బ్యాంక్ ను వేల కోట్లు మోసం చేసి లండన్ పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని భారత్ కు అప్పగించే ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. అతన్ని భారత్ కు రప్పించేందుకు మార్గం సుగుమమైందని తెలుస్తోంది. నవంబర్ 23న నీరవ్ ను భారత అధికారులకు అప్పగించే ఛాన్స్ ఉందని జాతీయ మీడియా కథనాలు తెలిపాయి.

భారత ప్రభుత్వం బ్రిటిష్ అధికారులకు అప్పగింత ప్రక్రియకు సంబంధించి ఇటీవల ఓ హామీ పత్రాన్ని కూడా సమర్పించింది. నీరవ్ మోదీని భారత్ కు తీసుకువచ్చిన తర్వాత కేవలం మోసం, మనీలాండరింగ్ కేసుల్లో మాత్రమే విచారణ జరుపుతామని ఇతర కస్టడీకి అప్పగించబోమని ఆ పత్రంలో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

సీబీఐ, ఈడీ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ , కస్టమ్స్, ఆదాయపు పన్ను విభాగం సంయుక్తంగా ఈ హామీ పత్రాన్ని అందించాయి. భారత్ కు అప్పగించిన తర్వాత నీరవ్ మోదీని ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో ఉంచుతారని..హై ప్రొఫైల్ ఖైదీలకు లభించే అన్ని సౌకర్యాలను కల్పిస్తారని పత్రంలో హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

తన అప్పగింత ప్రక్రియను సవాల్ చేస్తూ నీరవ్ మోదీ ఇటీవల మరోసారి లండన్ కోర్టును ఆశ్రయించారు. తనను భారత్ కు అప్పగిస్తే దేశంలోని అనేక విచారణ సంస్థలు దర్యాప్తు పేరుతో చిత్రహింసలకు గురిచేస్తాయని తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ కేసు మొత్తాన్ని తిరిగి ప్రారంభించాని నీరవ్ మోదీ అభ్యర్థించారు. లండన్ కోర్టు ఈ పిటిషన్ను పరిగణలోనికి తీసుకుంది.

ఈ నేపథ్యంలోనే భారత దర్యాప్తు సంస్థలు హామీ పత్రాన్ని సమర్పించగా..దీన్ని పరిశీలించిన న్యాయస్థానం నవంబర్ 23న తదుపరి విచారణ సమయంలో అతన్ని భారత్ కు అప్పగించే అవకాశాలు ఉన్నట్లు సదరు కథనాలు తెలిపాయి. తప్పుడు ఎల్ వోయూలతో పీఎన్బీని నీరవ్ మోసం చేసిన వ్యవహారం 2018 జనవరిలో వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ కుంభకోణంపై ఈడీ, సీబీఐ దర్యాప్తు చేపట్టాయి. అయితే అప్పటికే నీరవ్ దేశం విడిచి పారిపోయారు. ఈడీ అతన్ని పరారైన ఆర్థిక నేరగాడిగా ప్రకటించింది.

2018 డిసెంబర్ లో నీరవ్ తమ దేశంలో నివసిస్తున్నాడని బ్రిటన్ ప్రభుత్వం భారత్ కు తెలిపింది. దీంతో అతన్ని అప్పగించాలని భారత్ విజ్నాప్తి చేసింది. 2019 మార్చిలో నీరవ్ అక్కడి పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అతన్ని భారత్ కు అప్పగించడాన్నికి 2021లో నాటి బ్రిటన్ హోం మంత్రి ప్రీతి పటేల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ నీరవ్ లండన్ హైకోర్టులో అప్పీల్ చేసినప్పటికీ కోర్టు దాన్ని తిరస్కరించింది. బెయిల్ కోసం చాలా సార్లు దరఖాస్తు చేసినప్పటికీ ప్రతిసారీ భంగపాటే ఎదురైంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జై శ్రీరామ్‌ బస్తాల్లో పీడీఎస్‌ బియ్యం రీప్యాకింగ్‌

జై శ్రీరామ్‌ బస్తాల్లో పీడీఎస్‌ బియ్యం రీప్యాకింగ్‌ హసన్‌పర్తిలో ముఠా గుట్టురట్టు.. 56...

బాధ్యతాయుతమైన జర్నలిజంతోనే సమాజానికి మేలు

బాధ్యతాయుతమైన జర్నలిజంతోనే సమాజానికి మేలు వార్త ప్రచురించే ముందు వాస్తవాలను నిర్ధారించుకోవాలి ప్ర‌జాప్ర‌యోజ‌నాన్ని దృష్టిలో...

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో 22 మంది ఇన్‌స్పెక్టర్ల బదిలీ..

కమిషనరేట్‌లో భారీగా సీఐల బదిలీలు 22 మంది ఇన్‌స్పెక్టర్లకు స్థానచలనం కీలక పోలీస్‌స్టేషన్లకు కొత్త...

ములుగు ఇసుక క్వారీల్లో వివాదం

ములుగు ఇసుక క్వారీల్లో వివాదం త‌న‌పై హ‌త్యాయ‌త్నం జ‌రిగిందంటూ బీఆర్ఎస్ చ‌క్ర‌పాణి ఆరోప‌ణ‌ మూడు...

దమ్ముంటే రేవూరితో రాజీనామా చేయించి రండి

దమ్ముంటే రేవూరితో రాజీనామా చేయించి రండి రేవంత్‌ వచ్చినా.. రేవూరి తాత వచ్చినా...

వాహ్‌.. కమిషనర్‌ జీ! చిన్నారి వైద్యానికి అండగా అభిషేక్‌ అగస్త్య

వాహ్‌.. కమిషనర్‌ జీ! చిన్నారి వైద్యానికి అండగా అభిషేక్‌ అగస్త్య రూ.14 లక్షల సాయం...

స్వాంతంత్య్ర వేడుకలకు దూరంగా విద్యార్థులు

స్వాంతంత్య్ర వేడుకలకు దూరంగా విద్యార్థులు సెయింట్‌ థెరిస్సా పాఠశాలపై తల్లిదండ్రుల ఆగ్రహం బస్సు ఫీజులు...

వ్యూహకర్త కాదు… విజేత..!

వ్యూహకర్త కాదు... విజేత..! బీజేపీ కంచుకోటలో ప్రశాంత్ కిశోర్ సంచలనం ప్రత్యక్ష రాజకీయాల తొలి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.