epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

వ్యూహకర్త కాదు… విజేత..!

వ్యూహకర్త కాదు… విజేత..!
బీజేపీ కంచుకోటలో ప్రశాంత్ కిశోర్ సంచలనం
ప్రత్యక్ష రాజకీయాల తొలి పోరులోనే ఘన విజయం
19,246 ఓట్ల మెజారిటీతో బంకీపూర్‌ను కైవసం
ఇతర పార్టీలను గెలిపించిన పీకే… ఇప్పుడు తనకోసమే ప్రజా తీర్పు
జన్ సురాజ్‌కు తొలి భారీ రాజకీయ బ్రేక్‌త్రూ
బిహార్ రాజకీయ సమీకరణాల్లో కొత్త అధ్యాయానికి నాంది

కాకతీయ, నేష‌న‌ల్ డెస్క్ : ఎన్నికల వ్యూహాలతో దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన ప్రశాంత్ కిశోర్… ఇప్పుడు ప్రజా తీర్పుతో నాయకుడిగా ముద్ర వేశారు. ఎన్నో ఎన్నికల్లో ఇతర పార్టీల విజయాలకు వ్యూహాలు రచించిన ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ ప్రత్యక్ష రాజకీయాల్లో తొలి అడుగులోనే విజయఢంకా మోగించారు. బిహార్‌లోని బీజేపీకి కంచుకోటగా పేరొందిన బంకీపూర్ అసెంబ్లీ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై 19,246 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచారు. ఈ విజయంతో వ్యూహకర్తగా మాత్రమే కాదు… ప్రజా నాయకుడిగా కూడా తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. బంకీపూర్ నియోజకవర్గం బీజేపీకి దాదాపు మూడు దశాబ్దాలుగా తిరుగులేని కోట. వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నితిన్ నబిన్ రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. అధికార పార్టీ మరోసారి విజయంపై ధీమాగా ఉండగా… ప్రశాంత్ కిశోర్ మాత్రం తన ప్రజా పర్యటనలు, ప్రత్యామ్నాయ రాజకీయాల నినాదంతో నేరుగా బరిలోకి దిగారు. చివరకు బీజేపీకి గట్టి షాక్ ఇస్తూ విజయం సాధించారు.

మొదటి రౌండ్ నుంచే ఆధిక్యం

ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తొలి రౌండ్ నుంచే ప్రశాంత్ కిశోర్ తన ఆధిపత్యాన్ని చాటుకున్నారు. మొదటి రౌండ్‌లోనే 862 ఓట్ల ఆధిక్యం సాధించిన ఆయన… ప్రతి రౌండ్‌తో మెజారిటీని పెంచుకుంటూ వెళ్లారు. మధ్యలో ఎక్కడా ఆధిక్యం కోల్పోకుండా చివరకు 19 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. బీజేపీ బలమైన సంస్థాగత వ్యవస్థ, సంప్రదాయ ఓటు బ్యాంక్ ఉన్న నియోజకవర్గంలో ఈ విజయం సాధించడం రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రశాంత్ కిశోర్ పేరు భారత రాజకీయాల్లో ఎన్నికల వ్యూహాలకు పర్యాయపదంగా మారింది. 2014లో నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం నుంచి 2015 బిహార్ మహాఘట్‌బంధన్, 2019 ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ, 2021 పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్, తమిళనాడులో డీఎంకే, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ఆయన స్థాపించిన ఐ-ప్యాక్ ఎన్నికల వ్యూహాలకు కొత్త దిశను చూపింది. అయితే ఇతర పార్టీలకు వ్యూహాలు రచించడం ఒక ఎత్తైతే… ప్రజల ముందుకు స్వయంగా వచ్చి ఓట్లు అడిగి గెలవడం మరో ఎత్తు. ఆ పరీక్షలో కూడా ప్రశాంత్ కిశోర్ విజయవంతమయ్యారు.

పాదయాత్ర నుంచి పార్టీ నిర్మాణం వరకు

2021 తర్వాత ఎన్నికల వ్యూహకర్తగా కొనసాగకుండా బిహార్ అంతటా సుదీర్ఘ పాదయాత్ర చేపట్టారు. గ్రామాలు, పట్టణాలు చుట్టి ప్రజల సమస్యలను అధ్యయనం చేశారు. ఆ తర్వాత 2024 అక్టోబర్ 2న ‘జన్ సురాజ్’ పార్టీని స్థాపించి ప్రత్యామ్నాయ రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. మొదట్లో పార్టీ ప్రభావంపై అనుమానాలు వ్యక్తమైనప్పటికీ… బంకీపూర్ ఉపఎన్నిక ఫలితం జన్ సురాజ్‌ను రాజకీయ చర్చల్లోకి తీసుకొచ్చింది. బంకీపూర్ విజయం కేవలం ఒక ఉపఎన్నిక ఫలితం మాత్రమే కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీ, జేడీయూ, ఆర్జేడీ వంటి సంప్రదాయ పార్టీల మధ్య ప్రత్యామ్నాయ రాజకీయ వేదికకు కూడా అవకాశం ఉందనే సంకేతాన్ని ఈ ఫలితం ఇచ్చిందని విశ్లేషిస్తున్నారు. ప్రజల మధ్య సుదీర్ఘంగా పనిచేయడం, డేటా ఆధారిత రాజకీయాలు, క్షేత్రస్థాయి సంస్థాగత నిర్మాణం వంటి అంశాలు ప్రశాంత్ కిశోర్‌కు కలిసి వచ్చినట్లు భావిస్తున్నారు. అయితే ఒక నియోజకవర్గ విజయం రాష్ట్రవ్యాప్తంగా ప్రభావం చూపుతుందా? జన్ సురాజ్ పార్టీ ఈ ఊపును నిలబెట్టుకుంటుందా? రాబోయే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ శక్తిగా ఎదుగుతుందా? అనే ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ ఫలితం మరో విషయాన్ని కూడా స్పష్టం చేసింది. ఎన్నికలు గెలిపించే వ్యూహాలు రచించిన వ్యక్తి… ఇప్పుడు అదే వ్యూహాలతో తన రాజకీయ భవిష్యత్తును కూడా నిర్మించుకోవచ్చని ప్రశాంత్ కిశోర్ నిరూపించారు. బిహార్ రాజకీయాల్లో ఈ విజయం కొత్త సమీకరణాలకు నాంది పలుకుతుందా? లేక ఒక్క ఉపఎన్నిక విజయంగానే మిగిలిపోతుందా? అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పురుగులు ప‌రుగులు పెట్టించాయి

పురుగులు ప‌రుగులు పెట్టించాయి ఢిల్లీని కదిలించిన జెన్‌జీ జోరు! హేళనగా పుట్టిన 'కాక్రోచ్ జనతా...

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు పాఠశాల ఆవరణలోనే జరిగిన...

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన ‘మెలోడీ’ జోడీ

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన 'మెలోడీ' జోడీ ఎవియన్‌లో ముచ్చటించుకున్న మోదీ, మెలోనీ సోషల్...

భార్యకు పెళ్లి చేసిన భర్త

భార్యకు పెళ్లి చేసిన భర్త పన్నెండేళ్లు చిన్నవాడైన యువకుడితో వివాహిత ఎఫైర్ మహిళను కలిసేందుకు...

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్ దోపిడీలు, భూకబ్జాల కేసుల్లో అరెస్టయిన ‘ఫాల్తా...

మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!

మంత్రి రామలింగారెడ్డి రాజీనామా! బెంగళూరు అభివృద్ధి శాఖ ఇస్తామని మాటిచ్చి త‌ప్పారు సాగునీటి శాఖ...

రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు

రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు సీపీఎం నుంచి తృణమూల్ మీదుగా బీజేపీ వైపు నయా...

నన్ను క్షమించండి అమ్మా, నాన్న..

నన్ను క్షమించండి అమ్మా, నాన్న.. మళ్లీ పరీక్ష రాసే ధైర్యం లేదు.. నీట్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.