epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

దమ్ముంటే రేవూరితో రాజీనామా చేయించి రండి

దమ్ముంటే రేవూరితో రాజీనామా చేయించి రండి
రేవంత్‌ వచ్చినా.. రేవూరి తాత వచ్చినా పరకాలలో పోటీ చేస్తా
సీఎం రేవంత్‌రెడ్డిపై కొండా సుస్మితా పటేల్‌ తీవ్ర వ్యాఖ్యలు

కాకతీయ, గీసుకొండ : కొండా ఇలాకాలోకి వచ్చి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తమ కుటుంబంపై ఎందుకు మాట్లాడుతున్నారని కొండా సుస్మితా పటేల్‌ ప్రశ్నించారు. దమ్ముంటే పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డితో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని సవాల్‌ విసిరారు. రేవంత్‌రెడ్డి వచ్చినా.. రేవూరి ప్రకాశ్‌రెడ్డి కుటుంబం నుంచి ఎవరొచ్చినా పరకాలలో తాను పోటీ చేసి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. గీసుకొండ మండలంలోని ఎస్‌ఎస్‌ ఫంక్షన్‌హాల్‌లో మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సుస్మితా పటేల్‌ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పరకాల ఎన్నికలకు ముందు రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఎవరో ప్రజలకు తెలియదని సుస్మితా పటేల్‌ అన్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్‌రెడ్డికి కళ్లు నెత్తికెక్కాయా? అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవి కోరుకున్న సమయంలో తొలుత కొండా మురళీ, కొండా సురేఖ పేర్లను కోరుకున్నారని తెలిపారు. కొండా మురళీకి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని, ఆ మాట ఇచ్చారో లేదో ప్రమాణం చేయాలని సవాల్‌ చేశారు. హామీ ఇచ్చినప్పటికీ పదవి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.

‘దమ్ముంటే రాజీనామా చేయించి రండి’

పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డితో రాజీనామా చేయించి ఇప్పుడే ఎన్నికలకు రావాలని సుస్మితా పటేల్‌ సవాల్‌ చేశారు. రెండేళ్ల వరకు ఎందుకు వేచి ఉండాలని, ఇప్పుడే తేల్చుకుందామని అన్నారు. కాంగ్రెస్‌ టికెట్‌ ఇవ్వకపోయినా పరకాల నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుస్తానని ప్రకటించారు. రేవంత్‌రెడ్డి వచ్చినా, రేవూరి ప్రకాశ్‌రెడ్డి తాత వచ్చినా పరకాల నుంచి పోటీ చేసి గెలుస్తానని వ్యాఖ్యానించారు. త్వరలోనే పరకాలలో ఇల్లు కట్టుకుని ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు.
రేవంత్‌రెడ్డికి ఇంకా కాంగ్రెస్‌ సంస్కృతి పూర్తిగా అబ్బలేదని సుస్మితా పటేల్‌ విమర్శించారు. టీడీపీ నాయకులంటే ఆయనకు ఎందుకు ఇష్టమో అర్థం కావడం లేదన్నారు. కాంగ్రెస్‌ ఇప్పుడు ‘అచ్చ కాంగ్రెస్‌’కు బదులుగా ‘పచ్చ కాంగ్రెస్‌’గా మారిపోయిందని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన సోదరుడు కలిసి దోచుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎం బీసీ ఎమ్మెల్యేలకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం లేదని పలువురు తమ వద్దకు వచ్చి చెబుతున్నారని తెలిపారు. వేం నరేందర్‌రెడ్డి గత మూడేళ్లుగా సీఎంకు ఇచ్చిన సలహాలు ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. కొండా మురళీ, కొండా సురేఖ మంచివారు కాబట్టే ఇంతకాలం రేవంత్‌రెడ్డి గురించి తాము మాట్లాడలేదని, ఇకపై తాను ‘చిట్టక్క’గా మాట్లాడుతున్నానని సుస్మితా పటేల్‌ అన్నారు. ఏఐసీసీపై తనకు గౌరవం ఉందని, అయితే రేవంత్‌రెడ్డి ఇకపై జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జై శ్రీరామ్‌ బస్తాల్లో పీడీఎస్‌ బియ్యం రీప్యాకింగ్‌

జై శ్రీరామ్‌ బస్తాల్లో పీడీఎస్‌ బియ్యం రీప్యాకింగ్‌ హసన్‌పర్తిలో ముఠా గుట్టురట్టు.. 56...

బాధ్యతాయుతమైన జర్నలిజంతోనే సమాజానికి మేలు

బాధ్యతాయుతమైన జర్నలిజంతోనే సమాజానికి మేలు వార్త ప్రచురించే ముందు వాస్తవాలను నిర్ధారించుకోవాలి ప్ర‌జాప్ర‌యోజ‌నాన్ని దృష్టిలో...

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో 22 మంది ఇన్‌స్పెక్టర్ల బదిలీ..

కమిషనరేట్‌లో భారీగా సీఐల బదిలీలు 22 మంది ఇన్‌స్పెక్టర్లకు స్థానచలనం కీలక పోలీస్‌స్టేషన్లకు కొత్త...

ములుగు ఇసుక క్వారీల్లో వివాదం

ములుగు ఇసుక క్వారీల్లో వివాదం త‌న‌పై హ‌త్యాయ‌త్నం జ‌రిగిందంటూ బీఆర్ఎస్ చ‌క్ర‌పాణి ఆరోప‌ణ‌ మూడు...

వాహ్‌.. కమిషనర్‌ జీ! చిన్నారి వైద్యానికి అండగా అభిషేక్‌ అగస్త్య

వాహ్‌.. కమిషనర్‌ జీ! చిన్నారి వైద్యానికి అండగా అభిషేక్‌ అగస్త్య రూ.14 లక్షల సాయం...

స్వాంతంత్య్ర వేడుకలకు దూరంగా విద్యార్థులు

స్వాంతంత్య్ర వేడుకలకు దూరంగా విద్యార్థులు సెయింట్‌ థెరిస్సా పాఠశాలపై తల్లిదండ్రుల ఆగ్రహం బస్సు ఫీజులు...

పెద్ది… నిన్ను మరవదు ఈ గడ్డ..!

పెద్ది... నిన్ను మరవదు ఈ గడ్డ..! ఉద్య‌మ‌కారుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శ‌న్...

కాంగ్రెస్ నేత‌పై పెట్రోల్‌పోసి నిప్పంటించిన దుండ‌గులు

కాంగ్రెస్ నేత‌పై పెట్రోల్‌పోసి నిప్పంటించిన దుండ‌గులు నిర్మానుష్య ప్రదేశానికి పిలిచి దారుణం 50 శాతం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.