epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

దామోద‌ర్‌రెడ్డిలాంటి నేత‌లు అరుదు

  • నేటిత‌రం నేత‌ల్లో కూడ‌బెట్టేటోళ్లే అధికం
  • వేలాది ఎక‌రాల వార‌స‌త్వ భూముల‌ను త్యాగం చేశారు
  • నల్గొండ‌కు గోదావ‌రి నీళ్లు తెచ్చిన ఘ‌న‌త దామోద‌ర్‌రెడ్డిదే
  • ఎస్సారెస్పీ-2 ప్రాజెక్టుకు ఆర్‌డీఆర్ గా నామ‌క‌ర‌ణం చేస్తాం
  • 24గంట‌ల్లో జీవో జారీ చేస్తాం : సంతా ప‌స‌భ‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

కాక‌తీయ‌, తుంగ‌తుర్తి : నల్గొండ జిల్లాలో గోదావరి నీళ్లు ప్రవహిస్తున్నాయంటే దాని క్రెడిట్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి దేనని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎస్సారెస్పీ-2 ప్రాజెక్టుకు ఆర్‌డీఆర్ (మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి) ఎస్సారెస్పీ 2గా నామకరణం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు 24 గంటల్లో జీవో జారీ చేస్తామన్నారు. రాంరెడ్డి దామోదర్ రెడ్డి లాంటి నాయకులు రాజకీయాల్లో అరుదు. వారు చిరకాలం ప్రజల హృదయాల్లో నిలిచిపోతారని రేవంత్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో రాంరెడ్డి దామోదర్ రెడ్డి సంస్మరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ‘రాంరెడ్డి దామోదర్ రెడ్డి మ‌ర‌ణం తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు. ఆయన మరణం చాలా బాధాకరం, కానీ ఆయన జీవితం త్యాగానికి, నిబద్ధతకు, ప్రజాప్రేమకు నిలువెత్తు నిదర్శనం. ప్రజా జీవితంలో ఉన్నత స్థాయికి చేరినా.. ఆస్తుల కోసం కాదు, కార్యకర్తలు, పార్టీ కోసం పని చేశారు.

రాంరెడ్డి దామోద‌ర్‌రెడ్డి భూములు త్యాగం చేశారు

నేటి కాలంలో ఒక్కసారి ప్రజా ప్రతినిధి అయినా కోట్లు కూడబెడతారు. కానీ రాంరెడ్డి దామోదర్ రెడ్డి మాత్రం ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో వారసత్వంగా వచ్చిన వేలాది ఎకరాల భూములనూ త్యాగం చేశార‌ని ముఖ్య‌మంత్రి అన్నారు. ఆయన నిస్వార్థ రాజకీయానికి నిలువెత్తు నిదర్శనం. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ జెండాను అగ్రస్థానంలో ఉంచారు. గోదావరి జలాలను ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు తీసుకురావడానికి ఆయన పోరాటం మరువలేనిద‌ని అన్నారు. ఎస్‌ఆర్‌ఎస్‌పీ ద్వారా గోదావరి నీళ్లను నల్గొండ జిల్లాకు తెచ్చే ప్రయత్నంలో దామన్న వహించిన పాత్ర కీలకం. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఎస్‌ఆర్‌ఎస్‌పీ స్టేజ్ 2 ప్రారంభానికి ఆయన ఎంతగానో కృషి చేశారు. సూర్యాపేట కేంద్రంగా పనిచేసినా, తుంగతుర్తి నియోజకవర్గంలోని కార్యకర్తలకు దామన్న పెద్ద అండగా నిలిచారు. ఆయన సేవల ఫలితంగా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ 50 వేల మెజారిటీతో గెలిచారు. ఆయనను “టైగర్ దామన్న”గా సంబోధించడం ఆయన త్యాగానికి, ధైర్యానికి ఇచ్చిన గుర్తింపు అని అన్నారు.

కాంగ్రెస్‌తోనే చివరివరకూ జీవితం

రాంరెడ్డి దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై అమితమైన ప్రేమతో జీవించారు. చివరి శ్వాస కూడా కాంగ్రెస్ జెండాతోనే విడిచారు. జోడెద్దుల్లా రాంరెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర్ రెడ్డి కలిసి కాంగ్రెస్ పార్టీని నల్గొండలో నిలబెట్టారు. రాంరెడ్డి దామోదర్ రెడ్డి మరణంపై సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ తీవ్ర సంతాపం తెలియజేశారు. రాహుల్ గాంధీ స్వయంగా రాంరెడ్డి కుమారుడు సర్వోత్తం‌కు సంతాప లేఖ రాసి, భవిష్యత్తులో రాజకీయంగా కుటుంబానికి పూర్తి అండగా ఉంటామని సీఎం హామీ ఇచ్చారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.