epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఆధార్‌ కార్డు మోసాలను ఆపాలంటే.. ఇలా కార్డును లాక్‌ చేయండి.!

ఆధార్‌ అన్నింటికి మూలం.. మంచి పనులుక ముంచే పనులకు కూడా ఆధార్‌ కార్డే కావాలి. అందుకే ఈ మధ్య ఆధార్‌ కార్డును కూడా హ్యాక్‌ చేస్తున్నారు. జిరాక్స్‌ సెంటర్లో, రూమ్స్‌ తీసుకునేప్పుడు, మీ సేవా కేంద్రాల్లో ఇలా చాలా దగ్గర మనం ఆధార్‌కార్డు ఇస్తాం. కానీ వాళ్లు తర్వాత ఆధార్‌తో ఏమైనా చేయొచ్చు. అసలు మన ఆధార్‌ కార్డ్‌ నిజంగానే భద్రంగానే ఉందా అని మనకు ఒక్కోసారి డౌట్‌ వస్తుంది. ఆధార్‌ కార్డ్‌ యాక్సెస్‌ చేయగలిగితే, మన సమస్త సమాచారం సైబర్‌ నేరగాళ్ల చేతులో పెట్టినట్లే అవుతుంది. అయితే ఆధార్‌ కార్డ్‌ అవసరం లేని సమయంలో కార్డుని లాక్‌ చేసుకొని, మళ్లీ అన్‌లాక్‌ చేసుకోవడం ద్వారా ఆధార్‌ను సెక్యూర్‌ చేసుకోవచ్చు. ఇంతకీ ఆధార్‌ను ఎలా లాక్‌ చేసుకోవాలి.? ఎలా అన్‌లాక్‌ చేసకోవాలో ఇప్పుడు చూద్దాం.

ఆధార్‌ కార్డును లాక్‌ చేసుకోవడానికి ఆధార్‌ సెంటర్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఒక చిన్న ఎస్‌ఎమ్‌ఎస్ ద్వారా ఆధార్‌ కార్డును లాక్‌ లేదా అన్‌లాక్‌ చేసుకోవచ్చు. ఒక్కసారి ఆధార్‌ కార్డ్‌ లాక్‌ అయితే ఎవరూ కార్డును ఉపయోగించలేరు. ఆధార్‌ను లాక్‌ చేస్తే బయోమెట్రిక్‌, ఓటీపీ లాంటి సేవలేవీ పనిచేయవు. ఆధార్‌ కార్డును లాక్‌ లేదా అన్‌లాక్‌ చేయడానికి వర్చువల్‌ ఐడీని జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వర్చువల్ ఐడీని కూడా సింపుల్‌గా ఎస్‌ఎంఎస్‌ లేదా యూఐడీఏఐ వెబ్‌సైట్‌లో క్రియేట్ చేసుకోవచ్చు.

ఎలా లాక్‌ చేసుకోవాలంటే..

ఆధార్‌ కార్డును లాక్‌ చేసుకోవాలంటే ముందుగా మీ రిజిస్టర్‌ మొబైల్‌ నుంచి GETOTP అని టైప్‌ చేసి స్పేస్‌ ఇచ్చి మీ ఆధార్‌ నెంబర్‌లోని చివరి 4 నెంబర్లను టైప్‌ చేసి 1947 నెంబర్‌కు పంపాలి. వెంటనే యూఐడీఏఐ నుంచి మీకు 6 అంకెల ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత LOCKUID అని టైప్‌ చేసి స్పేస్‌ ఇచ్చి ఆధార్‌ నెంబర్‌లోని లాస్ట్‌ 4 అంకెలు ఇచ్చి, అంతకు ముందు వచ్చిన 6 అంకెల ఓటీటీపి ఎంటర్‌ చేసి సెండ్‌ చేయాలి. వెంటనే మీ ఆధార్‌ కార్డు లాక్‌ అవుతుంది. మీ ఆధార్‌ కార్డు లాక్‌ అయినట్లు వెంటనే మీ ఫోన్‌కు కన్ఫర్మేషన్‌ మెసేజ్‌ వస్తుంది.

ఎలా అన్‌లాక్‌ చేయాలి.

లాక్‌ చేసిన ఆధార్‌ కార్డును ఎస్‌ఎంఎస్‌తోనే అన్‌లాక్‌ చేసకోవచ్చు. ఇందుకోసం ముందుగా GETOTP అని టైప్‌ చేసి స్పేస్‌ ఇచ్చి మీరు ముందే క్రియేట్‌ చేసిన వర్చువల్‌ ఐడీ నెంబర్‌లోని లాస్ట్‌ 6 అంకెలను ఎంటర్‌ చేయాలి. ఎస్‌ఎంఎస్ పంపగానే మీకు 6 అంకెల ఓటీపీ వస్తుంది. తర్వాత UNLOCKUID అని టైప్‌ చేసి స్పేస్ ఇచ్చి వర్చువల్ ఐడీలోని చివరి 6 అంకెలు ఎంటర్‌ చేసి స్పేస్‌ ఇచ్చి 6 అంకెల ఓటీపీని ఎంటర్‌ చేసి ఎస్‌ఎమ్‌ఎస్‌ సెండ్‌ చేయాలి. వెంటనే మీ ఆధార్‌ కార్డు అన్‌లాక్‌ అవుతుంది. అన్‌లాక్‌ అయినట్లు మీకు కన్ఫర్మేషన్‌ మెసేజ్‌ కూడా వస్తుంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

అయోధ్య, కాశీ వెళ్లాలనుకుంటున్నారా? తక్కువ ధరకే IRCTC టూర్ ప్యాకేజీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: పుణ్యక్షేత్రాలను దర్శించాలని కోరుకునే భక్తుల కోసం ఐఆర్‌సీటీసీ...

చాన్నాళ్ల త‌ర్వాత ఢిల్లీలో మెరుగుప‌డిన వాయు నాణ్య‌త

చాన్నాళ్ల త‌ర్వాత ఢిల్లీలో మెరుగుప‌డిన వాయు నాణ్య‌త కాక‌తీయ‌, న్యూఢిల్లీ(జూలై 26) :...

క‌నుల విందుగా బ్లాక్ బెర్రీ అందాలు

క‌నుల విందుగా బ్లాక్ బెర్రీ అందాలు ఇసుక దిబ్బ‌ల్లో ఆట‌లు.. పిల్లకాలువలో ఈతలు తాడ్వాయి...

ఇంటి ముందు చెప్పులు తిరగబడి ఉంటే.. ఇంట్లో వాళ్లకు ఈ సమస్యలకు తప్పవు 

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉంచిన ప్రతి వస్తువు సానుకూల, ప్రతికూల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.