epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కేసీఆర్ క‌ట్టించిన ఇళ్ల‌నే ఇస్తున్న‌రు : మన్నె గోవర్ధన్ రెడ్డి

కేసీఆర్ క‌ట్టించిన ఇళ్ల‌నే ఇస్తున్న‌రు
`ఇందిర‌మ్మ`పై ఎలాంటి పురోగ‌తి లేదు
బీ ఆర్ ఎస్ నేత మన్నె గోవర్ధన్ రెడ్డి

కాకతీయ, తెలంగాణ బ్యూరో : రేవంత్ పాలన ప్రజా పాలన కాదని, ప్రజా భక్షక పాలన అని బీ ఆర్ ఎస్ సీనియర్ నేత మన్నె గోవర్ధన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అధికారం లోకి వచ్చి 20 నెలలు దాటినా ఇందిరమ్మ ఇండ్లపై ఎలాంటి పురోగతి లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కట్టించిన ఇళ్లను మాత్రమే ఇప్పుడు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. వరంగల్ ప‌శ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సైతం ఇదే విషయాన్ని అంగీకరించారని తెలిపారు. సంవత్సరానికి 4 లక్షల ఇళ్లు కడతామని చెప్పి, ఆ దిశగా ఒక్క అడుగు కూడా వేయలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు ప్రచార యావకే పరిమితమై, తమ కార్యకర్తలకే ఇళ్లు కేటాయిస్తున్నారని విమర్శించారు. రేషన్ కార్డుల విషయంలో కూడా కాంగ్రెస్ అబద్ధాలు ప్రచారం చేస్తోందని, హైదరాబాద్‌లో దరఖాస్తు చేసిన వారిలో కేవలం 53 వేల మందికే ఇచ్చారని అన్నారు. ఎన్నికల కోసమే హడావుడిగా పంపిణీ చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ హయాంలో 6.47 లక్షల రేషన్ కార్డులు జారీ చేశామని గుర్తు చేశారు. హైదరాబాద్‌లో వర్షాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నా, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లపైనే కాకుండా వంతెనలపై కూడా నీరు నిలిచే పరిస్థితి ఏర్పడిందని, చిన్న చిన్న నిర్వహణ పనులు కూడా చేయలేని స్థితి వచ్చిందని అన్నారు. కేసీఆర్, కేటీఆర్ చొరవతో హైదరాబాద్‌లో గత 10 ఏళ్లలో 50 వేల కోట్ల రూపాయల అభివృద్ధి జరిగిందని, ఎస్‌ఆర్‌డీపీ కింద ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మాణం వలన ట్రాఫిక్ సమస్య తగ్గిందని గుర్తు చేశారు. రేవంత్ నిర్లక్ష్యం వలన మళ్లీ సమస్యలు పెరుగుతున్నాయని అన్నారు. సీఎం రేవంత్ విద్యాశాఖ, మున్సిపల్ శాఖ, హోంశాఖలో విఫలమయ్యారని, చేయలేక పోతే పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేశారు. హోమ్ మంత్రిగా ప్రతిపక్షాలపై కేసులు పెట్టడమే ఆయన పని అయిపోయిందని, కొంతమంది అధికారులు కూడా కాంగ్రెస్ నేతల ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఎలాగూ రాబోయేది బీ ఆర్ ఎస్ ప్రభుత్వమే. తప్పు చేసిన అధికారులపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం అని ఆయ‌న‌ హెచ్చరించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

నాటు సారా స్థావరాలపై ఎక్సైజ్‌ దాడులు

నాటు సారా స్థావరాలపై ఎక్సైజ్‌ దాడులు 1,900 లీటర్ల చక్కెర పానకం ధ్వంసం 55...

‘నార్మల్ లేదు… బ‌ల‌వంతంగా ప‌వ‌ర్ పెట్రోల్‌..?

'నార్మల్ లేదు... బ‌ల‌వంతంగా ప‌వ‌ర్ పెట్రోల్‌..? పెట్రోల్ బంకుల తీరుపై వాహనదారుల ఆగ్రహం అధిక...

రూ.180 కోట్ల డ్రైనేజీ టెండర్‌లో భారీ గోల్‌మాల్..?

రూ.180 కోట్ల డ్రైనేజీ టెండర్‌లో భారీ గోల్‌మాల్..? సర్ధార్ రవీందర్ సింగ్ భూగర్భ మురుగునీటి...

వ‌రంగ‌ల్ సీపీగా శ్వేత

వ‌రంగ‌ల్ సీపీగా శ్వేత సైబరాబాద్ క‌మిష‌న‌రేట్‌ ట్రాఫిక్ విభాగానికి సన్‌ప్రీత్ సింగ్ బ‌దిలీ...

ధాన్యం కాంట్రాక్టర్ల అసమర్థతకు మేం బ‌లికావాలా..?

ఇసుక లారీలను బలవంతంగా ఆపడం సరికాదు ధాన్యం కాంట్రాక్టర్ల అసమర్థతకు మేం బ‌లికావాలా..? వేధింపులు...

ఖమ్మంలో మంత్రి తుమ్మలకు మచ్చ తెచ్చే పని.. పీవీ కుమార్తె ఫిర్యాదుతో సీరియస్ అయిన అమాత్యుడు!

మంత్రి తుమ్మ‌ల‌కు మ‌చ్చ తెచ్చే ప‌ని 40ఏళ్ల మంత్రి అనుభ‌వాన్ని గుర్తించేలా పైలాన్...

బావిలో పడి తండ్రి–కొడుకు మృతి

బావిలో పడి తండ్రి–కొడుకు మృతి మంత్రి సీతక్క దిగ్బ్రాంతి కాకతీయ, ములుగు ప్రతినిధి :...

హత్య కేసులో నలుగురికి జీవిత ఖైదు

హత్య కేసులో నలుగురికి జీవిత ఖైదు సిరిసిల్ల జిల్లా ప్రధాన న్యాయమూర్తి సంచలన...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.