epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రెవెన్యూశాఖ అధికారుల‌పై ఏసీబీ ఫోక‌స్‌..ఆదాయం క‌న్నా ఆస్తులు ఉన్నవారే టార్గెట్..!!

*నెక్ట్స్ ఎవ‌రు..?
*రెవెన్యూశాఖ అధికారుల‌పై ఏసీబీ ఫోక‌స్‌
*ఆదాయం క‌న్నా ఆస్తులు మిన్న‌గా ఉన్న వారిపైనే ఫోక‌స్‌
*ఆదాయానికి మించి ఆస్తులున్న‌ట్లుగా వెళ్తున్న ఫిర్యాదులు
*ఏసీబీని ఆశ్ర‌యిస్తున్న భూ బాధితులు.. వ‌ల‌వేస్తున్న అవినీతి నిరోధ‌క శాఖ‌
*ఇప్ప‌టికే ఆర్డీవో రేసులో ఉన్న ఇద్ద‌రు ఎమ్మార్వ‌ల‌కు షాక్‌
*పోస్టింగ్‌ల విష‌యంలో పెరిగిన పోటీ.. ఫిర్యాదుల్లోనూ ఉద్యోగుల మ‌ధ్య పోటీ..!

కాకతీయ, వరంగల్ బ్యూరో : ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా రెవెన్యూ శాఖ ఉద్యోగుల‌పై ఏసీబీ గురి పెట్టింది. లంచ‌గొండులు.. ఆదాయానికి మించి ఆస్తులు క‌లిగి ఉన్న‌ట్లుగా కొంత‌మంది అధికారుల‌పై ఫిర్యాదులు వెళ్తుండ‌టంతో న‌జ‌ర్ వేస్తోంది. బాధితులు, వివిధ వ‌ర్గాల నుంచి అందుతున్న స‌మాచారంతో ఏసీబీ స్కెచ్ గీస్తోంది. ఆదాయానికి ఆస్తులు క‌లిగి ఉన్న‌ట్లుగా ఫిర్యాదులు.. ప్ర‌భుత్వ నిఘా వ‌ర్గాల స‌మాచారంతో దాడులుకు దిగుతుండ‌టం గ‌మ‌నార్హం. భూములు విలువ ఎక్కువ‌గా ఉన్న వ‌రంగ‌ల్‌, హ‌న్మ‌కొండ జిల్లాల్లో ప‌నిచేసే అధికారుల‌పై ఫిర్యాదులు వెళ్తున్న‌ట్లు స‌మాచారం.

సోదాల‌తో రెవెన్యూలో క‌ల‌వ‌రం..!

స‌హ‌జంగా కార్యాల‌యంలో జ‌రిగే ప‌నుల‌కు డ‌బ్బులు డిమాండ్ చేయ‌డం.. భూ రిజిస్ట్రేష‌న్లు.. ఉచితంగా చేయాల్సిన ప‌నుల‌కు రేట్లు ఫిక్స్ చేసి ఎమ్మార్వోలు కింది స్థాయి ఉద్యోగుల నుంచి వ‌సూళ్లకు తెగ‌బ‌డుతుంటారు. త‌మ చేతికి మ‌ట్టి అంట‌కుండా ప‌ని కానిచ్చేస్తున్న అధికారుల‌ను ప‌ట్టుకోవ‌డం ఏసీబీకి కూడా అంత సులువు కావ‌డం లేదు. దీంతో తాజాగా ప్ర‌భ‌త్వ నిఘా వ‌ర్గాలు, ఇత‌ర ప్ర‌జా సంబంధాలు, ఫిర్యాదు దారుల నుంచి వ‌స్తున్న సమాచారంతో ఆదాయానికి మించిన ఆస్తులేమైనా ఉన్నాయా అంటూ త‌నిఖీలు దిగుతుండ‌టం గ‌మనార్హం. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ త‌ర‌హా సోదాలు గ‌డిచిన ఏడాదిన్న‌ర కాలంలో ఇద్ద‌రి ఎమ్మార్వ‌లో ఇళ్ల‌లో చోటు చేసుకున్నాయి.

గ‌తంలో ధ‌ర్మ‌సాగ‌ర్ ఎమ్మార్వోగా ప‌నిచేసి ఎన్నిక‌ల ముందు పొరుగు జిల్లా జ‌మ్మికుంట‌కు బ‌దిలీపై వెళ్లిన అధికారి ర‌జ‌ని ఇళ్ల‌పై ఏడాదిన్న‌ర క్రితం ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు క‌లిగి ఉన్న‌ట్లుగా గుర్తించారు. పెద్ద మొత్తంలో అక్ర‌మాస్తులు క‌లిగి ఉన్న‌ట్లు గుర్తించి సీజ్ చేశారు. ర‌జ‌నిపై కేసు న‌మోదు చేసి ఏసీబీ కోర్టులో నిల‌బెట్టారు. ఏసీబీ విచార‌ణ ఇంకా కొన‌సాగుతుండ‌టం గ‌మ‌నార్హం. తాజాగా ఖిలా వ‌రంగ‌ల్ త‌హ‌సీల్దార్‌గా ప‌నిచేసిన బండి నాగేశ్వ‌ర్ ఇళ్ల‌పైనా ఇదే త‌ర‌హాలో ఏసీబీ దాడులు నిర్వ‌హించింది. సుమారు రూ.5కోట్ల పైచిలుకు అక్ర‌మాస్తుల‌ను గుర్తించిన‌ట్లుగా ఏసీబీ వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే.

ఇద్ద‌రు ఆర్డీవో రేసులో ఉన్న‌వాళ్లే..!

ధ‌ర్మ‌సాగ‌ర్ ఎమ్మార్వోగా ప‌నిచేసిన ర‌జ‌ని రెడ్డి, ఖిలా వ‌రంగ‌ల్ త‌హ‌సీల్దార్‌గా ప‌నిచేసిన బండి నాగేశ్వ‌ర్‌రావులు ఇద్ద‌రు కూడా ఆర్డీవో రేసులో ఉన్న‌వారే కావ‌డం గ‌మ‌నార్హం. వాస్త‌వానికి రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో ఎమ్మార్వోలు స‌హ‌క‌రించ‌క‌పోతే ట్రాన్స‌ఫ‌ర్ బ‌హుమానంగా ఉంటోంద‌న్న విమ‌ర్శ‌లు ఆ డిపార్ట్‌మెంట్‌లోని ఉద్యోగులు చెబుతున్నారు. ఇందులో కూడా చాలా వ‌ర‌కు వాస్త‌వం ఉంది. నిజాయితిగా ఉంటే.. ఎమ్మెల్యే స‌హా ఇత‌ర‌ప్ర‌జాప్ర‌తినిధుల ఒత్తిళ్లు కూడా ఉంటున్నాయ‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి.

ఈనేప‌థ్యంలోనే.. స్వామికార్యం.. స్వ‌కార్యం అన్న రీతిలో ఎమ్మార్వోల అక్ర‌మాలు.. అవినీతి వ్య‌వ‌హారాలు అలా జ‌రిగిపోతున్నాయి. ఇదిలా ఉండ‌గా రెవెన్యూ ఉద్యోగుల మ‌ధ్య ఉన్న పోస్టింగ్‌ల పోటీ .. అంత‌ర్గ‌త విబేధాలతో కూడా త‌మ అనున‌యుల‌తో ఏసీబీకి ఒక‌రిపై మ‌రోక‌రు ఫిర్యాదులు చేసుకుంటున్న‌ట్లు ఉద్యోగుల మ‌ధ్య చ‌ర్చ జ‌రుగుతోంది. ఏసీబీ న‌జ‌ర్ రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌పై కొన‌సాగుతోంద‌ని.. నెక్ట్స్ ఎవ‌రో చూడాలంటూ అభిప్రాయం వ్య‌క్తం చేస్తుండ‌టం గ‌మ‌నార్హం.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

కరెంటు లేక రైతుల అవస్థలు

కరెంటు లేక రైతుల అవస్థలు కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంటలు ఎండుతున్నాయి ఎల్‌నినో ముప్పు...

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌ రూ.650 కోట్ల బొగ్గు నిధుల మళ్లింపుపై సోదాలు! హైదరాబాద్‌లో ఏఎంఆర్‌...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..!

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..! నాపై వార్తలు రాసిన వాళ్లపై కేసులు పెట్టండి ‘కాకతీయ’ స్టాఫర్‌పై...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.