epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మంత్రి కొండా ఇంటి ముట్టడి..అంగన్వాడీల మహా ధర్నా..!!

కాకతీయ, వరంగల్ బ్యూరో : అంగన్వాడీ ఉద్యోగుల ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. ప్రీ ప్రైమరీ పీఎం శ్రీవిద్యను అంగన్వాడీ కేంద్రాల్లోనే నిర్వహించాలన్న డిమాండ్‌తో సిఐటియు పిలుపు మేరకు వందలాది అంగన్వాడీలు మంత్రి కొండా సురేఖ ఇంటి ఎదుట మహాధర్నాకు దిగారు. ఈ క్రమంలో రాంనగర్ సుందరయ్య భవన్‌ నుంచి భారీ ర్యాలీగా బయలుదేరిన అంగన్వాడీలను పోలీసులు అడ్డుకుంటూ అరెస్టులు చేసి సుబేదారి, హనుమకొండ, కేయూ పోలీస్‌స్టేషన్లకు తరలించారు.

అయినప్పటికీ అంగన్వాడీలు పోలీసులు ఏర్పాటుచేసిన గేట్లను దాటి మంత్రి ఇంటి ముందుకు చేరుకున్నారు. దీంతో అక్కడ అంగన్వాడీలు, పోలీసుల మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. చివరికి అరెస్టైన వారిని విడుదల చేయడంతో ఆందోళన మరింత జోరందుకుంది. ధర్నా సందర్భంగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి రాగుల రమేష్ మాట్లాడారు. కొత్త జాతీయ విద్యా విధానం పేరుతో కేంద్రం ఐసిడిఎస్‌ను నిర్వీర్యం చేస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే దారిలో నడుస్తోందని విమర్శించారు.

ప్రీ ప్రైమరీ విద్యను విద్యాశాఖకు అప్పగించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, అంగన్వాడీ టీచర్ల ద్వారానే పీఎం శ్రీవిద్యను నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే అంగన్వాడీల వేతనాన్ని రూ.18 వేలుగా అమలు చేయాలని, ఎఫ్‌ఆర్‌ఎస్ విధానాన్ని రద్దు చేయాలని, పనికిరాని మొబైల్ ఫోన్లను 5జీ సదుపాయాలతో భర్తీ చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి జి. ప్రభాకర్ రెడ్డి కూడా అంగన్వాడీల పోరాటానికి మద్దతు తెలిపారు.

కనీస వేతనం రూ.26 వేలుగా ఇవ్వాలని, 13 నెలల క్రితం ప్రకటించిన రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఖాళీ పోస్టులను భర్తీ చేసి, కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని పిలుపునిచ్చారు. ఈ ధర్నాలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు టి. ఉప్పలయ్య, ఉపాధ్యక్షుడు సుంచు విజయేందర్, బొట్ల చక్రపాణి, అంగన్వాడీ యూనియన్ నాయకులు వీరగోని నిర్మల, శోభారాణి, రాజేశ్వరి, రమాదేవి, జమున, హైమావతి, రజిత, అనిత, ఉమాదేవి, ఎండి. మైముదా, అంజుమ్, శారద తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

కరెంటు లేక రైతుల అవస్థలు

కరెంటు లేక రైతుల అవస్థలు కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంటలు ఎండుతున్నాయి ఎల్‌నినో ముప్పు...

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌ రూ.650 కోట్ల బొగ్గు నిధుల మళ్లింపుపై సోదాలు! హైదరాబాద్‌లో ఏఎంఆర్‌...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..!

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..! నాపై వార్తలు రాసిన వాళ్లపై కేసులు పెట్టండి ‘కాకతీయ’ స్టాఫర్‌పై...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.