epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రాజకీయాలకు అతీతంగా మహిళా డైరీ అభివృద్ధి..!!

కాకతీయ, గీసుగొండ: రాజకీయాలకు అతీతంగా మహిళా డైరీని అభివృద్ధి చేసుకుందామని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు.మండలం కేంద్రంలోని పి.ఎస్.ఆర్.గార్డెన్స్‌లో గీసుగొండ, సంగెం మండలాల ఇందిరా మహిళా ప్రాథమిక సహకార పాల ఉత్పత్తిదారుల సంఘాల ఈసి సభ్యుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ప్రతి మహిళను పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్ది, వారిని కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. నిజాయితీ, నిబద్ధత, మన పెట్టుబడి ఆధారంగా పరకాల ఇందిరా మహిళ పాల ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య లిమిటెడ్‌ను దామెరలో ఏర్పాటు చేయబోతున్నట్టు వెల్లడించారు. జనాభాలో సగం ఉన్న మహిళలను చైతన్యం చేసి వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలి.

నర్సంపేటలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు మహిళా సంఘాలను అభివృద్ధి పరిచా. అప్పట్లో మహిళలు చాలా అవమానాలు ఎదుర్కొన్నారు కానీ ఇప్పుడు ప్రతీ కార్యక్రమంలో మహిళా ప్రాధాన్యం ఎంతో ఆవశ్యకమైందని అన్నారు. మహిళలకు నైపుణ్యం కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను పెట్టి మహిళలను వృత్తి వ్యాపార పరంగా శక్తివంతంగా మార్చ పోతున్నామని అన్నారు. వ్యవసాయ ఆధారిత కుటుంబాలకు ఆర్థికాభివృద్ధి, పశు పోషకులకు న్యాయమైన ఆదాయం, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ఈ డైరీ స్థాపన ప్రధాన ఉద్దేశమని చెప్పారు.

10 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించుకోవడం, శిక్షణా కార్యక్రమాలను పూర్తి చేయడం, ముల్కనూరు సహకార డైరీ సహకారం పొందడం వంటి దశలను పూర్తి చేసుకున్నామని తెలిపారు. ఆరు మండలాలను కలుపుకొని దామెరలో ఏర్పాటు కాబోతున్న ఈ డైరీ, రాజకీయాలకు అతీతంగా మహిళల సహకారంతో ఉన్నత స్థాయిలో ఎదుగుతుందన్న నమ్మకం వ్యక్తం చేశారు. మహిళలకు అవకాశం కల్పిస్తే ఏ స్థాయిలో అభివృద్ధి సాధించగలరో పరకాల మహిళా బ్యాంక్ నిదర్శనమని ఎమ్మెల్యే అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి నీరజ, జడ్పీసీఈఓ రాం రెడ్డి,డిపిఎం వరలక్ష్మి,ఏపీడి రేణుకా దేవి,జిల్లా పశు వైద్యాధికారి బాలకృష్ణ,తహసిల్దార్ రియాజుద్దీన్,ఇన్చార్జ్ ఎంపీడీఓ పాక శ్రీనివాస్, ఏపీఎం ఈశ్వర్, మండల సమైక్య అధ్యక్షురాలు గట్టు రజిత, స్వయం సహాయక సంఘాల సీసీలు, సిఏలు, సభ్యురాల్లు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

కరెంటు లేక రైతుల అవస్థలు

కరెంటు లేక రైతుల అవస్థలు కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంటలు ఎండుతున్నాయి ఎల్‌నినో ముప్పు...

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌ రూ.650 కోట్ల బొగ్గు నిధుల మళ్లింపుపై సోదాలు! హైదరాబాద్‌లో ఏఎంఆర్‌...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..!

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..! నాపై వార్తలు రాసిన వాళ్లపై కేసులు పెట్టండి ‘కాకతీయ’ స్టాఫర్‌పై...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.