epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

జగిత్యాల జిల్లాలో ర్యాగింగ్ క‌ల‌క‌లం..

జగిత్యాల జిల్లాలో ర్యాగింగ్ క‌ల‌క‌లం..
ఇద్ద‌రు మ‌గ విద్యార్దుల‌కు వివాహ వేడుక జ‌రిపిన సీనియ‌ర్ విద్యార్దులు
సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిన వీడియో
ఉన్న‌తాదికారులు నేరుగా జోక్యం చేసుకోవాల‌ని విద్యార్ది సంఘాల డిమాండ్‌

కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ బ్యూరో : జగిత్యాల జిల్లా కోడిమాల మండ‌లం స‌మీపంలోని నాచుప‌ల్లి జెఎన్టీయూ క్యాంపస్లో సీనియ‌ర్ విద్యార్దులు జూనియ‌ర్ విద్యార్దుల‌ను ర్యాగింగ్ చేసిన ఘ‌ట‌న సంచలనంగా మారింది. సీనియర్లు జూనియర్ల పై విచక్షణ రహితంగా దుర్వినియోగం చేసిన వీడియోలు బయటకు రావడంతో విద్యార్థి వర్గాల్లో కలకలం రేగింది. కాలేజీకి విద్యాబోధన కంటే ర్యాగింగ్ అసభ్య వినోదాలకు ఎక్కువ ప్రాధాన్యత పెరుగుతోందనే అభిప్రాయం బలపడుతోంది. నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనను దాచిపెట్టేందుకు ప్రయత్నించినా నెట్టింట వీడియోలు వైరల్ కావడంతో అసలు పరిస్థితి బయటపడింది. వీడియోల్లో మగ విద్యార్థులిద్దరికీ వివాహం నిర్వహిస్తున్న దృశ్యాలు స్పష్టంగా వెలికి చూశాయి.

మాంగళ్యం ధరింపజేయడం, అరుంధతి చూపించడం, వివాహానంతర ఆచారాల వరకు సీనియర్లు ర్యాగింగ్‌ను అసహజంగా మార్చిన తీరు ఆగ్రహానికి దారి తీస్తోంది. కొందరిని చున్నీ కట్టించి డ్యాన్సులు చేయించడం బలవంతంగా అవమానకర పరిస్థితుల్లోకి నెట్టడం వంటి సన్నివేశాలు విద్యార్థుల భద్రతపై పెద్ద ప్రశ్నను లేవనెత్తుతున్నాయి. సంఘటన జరిగి నాలుగు రోజులు గడిచినా కాలేజీ యాజమాన్యం కానీ పోలీసులు కానీ స్పందించకపోవడం మరింత అనుమానాస్పదంగా మారింది. క్యాంపస్‌లో పర్యవేక్షణ పూర్తిగా క‌నుమ‌రిగైయింద‌ని యాజామాన్యం ఎందుకు మౌనంగా ఉందన్న విమర్శలు ఊపందుకుంటున్నాయి.

ఇటీవలి కాలంలో సెక్యూరిటీ చీఫ్ విద్యార్థులతో దురుసుగా ప్రవర్తించిన ఘటనపై నిరసనలు చోటుచేసుకున్న నేపథ్యంలో క్యాంపస్‌లో శాంతి భద్రత పూర్తిగా విఘాతం చెందిందని విద్యార్థి సంఘాలు చెబుతున్నాయి. పరిపాలన వ్యవస్థ బలహీనత నియంత్రణలో వైఫల్యమే ఇటువంటి పరిస్థితులకు దారి తీస్తోందని అభిప్రాయాలు వెలువడుతున్నాయి. బాధ్యులైన సీనియర్లు, అధికారులు, నిర్వాహకులపై తక్షణ చర్యలు తీసుకోవాలని ర్యాగింగ్ పై కఠినమైన నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని కొండగట్టు జెఎన్టీయూ పరిస్థితిపై ఉన్నతాధికారులు నేరుగా జోక్యం చేసుకోవాలనే డిమాండ్ తీవ్రంగా వినిపిస్తోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.