epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఇసుక లోడింగ్ బంద్

ఇసుక లోడింగ్ బంద్
ములుగు జిల్లాలో కాంట్రాక్ట‌ర్ల సిండికేట్‌
ప్ర‌భుత్వం బిల్లులు ఇవ్వ‌డం లేద‌ని ఆరోప‌ణ‌లు
ఆ మొత్తం లారీ య‌జ‌మానుల నుంచి వ‌సూలు
రూ.3500వేలు ఇవ్వాల్సిందేనంటూ హుకుం
భ‌ద్రాచ‌లం, భూపాల‌ప‌ల్లి, ములుగు జిల్లా కాంట్రాక్ట‌ర్ల వైఖ‌రి
టీజీఎండీసీ అధికారులూ వ‌త్తాసు ప‌లుకుతున్నారంటూ మండిపాటు
టీజీఎండీసీ కార్యాల‌యంలో ర‌హ‌స్యంగా కాంట్రాక్ట‌ర్ల‌తో లారీ య‌జ‌మానుల భేటీ

కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా సహా భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో ఇసుక లోడింగ్ పనులు పూర్తిగా నిలిచిపోయాయి అని, ప్రభుత్వ బిల్లులు నాలుగు నెలలుగా విడుదల కాలేదనే సాకుతో కాంట్రాక్టర్లు ప్రతి లారీపై అదనంగా లోడింగ్ చార్జీలు చెల్లిస్తేనే లోడింగ్ చేస్తామంటూ బుధవారం ఉదయం నుండే ఇసుక లోడింగ్ నిలిపివేసినట్టు సమాచారం. ములుగులో 3,500,భూపాలపల్లిలో 2,500,భద్రాద్రిలో 2,000 ఇవ్వకపోతే లోడింగ్ జరగదని నిరుపేసినట్టు సమాచారం.

జిల్లాలవారీగా కాంట్రాక్టర్ల డిమాండ్లు ఇలా

ములుగు 3,500, భూపాలపల్లి 2,500, భద్రాద్రి 2,000 చొప్పున అదనపు లోడింగ్ చార్జీ చెల్లించాలని కాంట్రాక్ట‌ర్లు హుకుం జారీ చేస్తుండ‌టం గ‌మ‌నార్హం. ఇందుకు టీజీఎండీసీ అధికారులు కూడా వారికి మ‌ద్ద‌తు తెలుపుతున్న‌ట్లుగా లారీ అసోసియేష‌న్ నాయ‌కులు వెల్లడిస్తుండ‌టం గ‌మ‌నార్హం. వాస్త‌వానికి సర్కారు నిర్ణయించిన 14,800 ఇసుక డీడీలోనే లోడింగ్ చార్జీలు చెల్లించాల్సి ఉండగా, కాంట్రాక్టర్లు దీనిని పూర్తిగా పక్కన పెట్టి లారీ యజమానుల వద్ద నుంచి మళ్లీ డబ్బు వసూలు చేస్తుండ‌టం గ‌మనార్హం.

డీడీ కి అదనంగా ఇవ్వాలి..

ప్రతి లారీకి ప్రభుత్వం స్థిరపరిచిన 14,800 డీడీతోపాటు లోడింగ్ చార్జీలు కూడా ప్రభుత్వమే చెల్లించాల్సి ఉండగా మాలోడింగ్ చార్జీలు ప్రభుత్వం ఇవ్వడం లేదని, బిల్లులు నాలుగు నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయి అనే కారణాలు చెబుతూ కాంట్రాక్టర్లు లారీ యజమానుల వద్ద నుంచి అక్రమ వసూళ్లు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే లోడింగ్ డబ్బులు కూడా తీసుకొని లారీ యజమానుల నుంచి కూడా లోడింగ్ చార్జీలను వసూలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

టీజీఎండీసీ ఆధ్వర్యంలో జరిగిన రహస్య సమావేశం!

భద్రాచలం, భూపాలపల్లి, ములుగు జిల్లాల ఇసుక కాంట్రాక్టర్లు మరియు లారీ ఓనర్లతో రాష్ట్ర టీజీ ఎండీసీ అధికారుల సూచ‌న‌ల మేర‌కు మంగ‌ళ‌వారం స‌మావేశం కూడా నిర్వ‌హించుకున్నారు. ఈ స‌మావేశంలో కాంట్రాక్ట‌ర్లు లోడింగ్‌కు చార్జీలు విధించాల‌ని డిమాండ్‌ను వినిపించారు. ప్రతి లారీపై రూ. 2వేల నుంచి 3500వర‌కు ఆయా ఏరియాల వారీగా అడుగుతుండ‌టం గ‌మ‌నార్హం.ఈ డబ్బు చెల్లించకపోతే లోడింగ్ నిలిపివేయాలని కాంట్రాక్టర్లు నిర్ణ‌యించుకున్నారు. ఆ ప్ర‌కార‌మే బుధ‌వారం లోడింగ్ నిలిపివేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. సర్కారు చెల్లించాల్సిన డబ్బు ను లారీ యజమానులపై కాంట్రాక్టర్లు మోపుతున్నారని లారీ అసోసియేష‌న్లు మండిప‌డుతున్నాయి. ఇసుక ధర 14,800 ఉండగా ఇందులోనే లోడింగ్ చార్జీలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది అని, కాంట్రాక్టర్లు లారీ యజమానుల వద్ద నుండి ఏ విధమైన అదనపు లోడింగ్ చార్జీలు వసూలు చేయరాదు అనే నియమమున ఈ నిబంధనలను పట్టించుకోకుండా అదనపు వసూళ్లు చేయడం వల్ల లారీ యాజమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇసుక లోడింగ్ బంద్…..

ములుగు జిల్లాలోని ఇసుక క్వారీలలో బుధవారం ఉదయం నుంచి లోడింగ్ నిలిచిపోయాయని, క్వారీ యాజమానులు లోడింగ్ చార్జీలు నిర్ణయించిన మేరకు చెల్లిస్తేనే ఇసుక లోడింగ్ చేస్తామంటూ కాంట్రాక్టర్లు భీష్మించుకు కూర్చున్నారని, లోడింగ్ కోసం వెళ్లిన లారీలు భారీ నిలిచిపోవడంతో చేసేదేమీ లేక కాంట్రాక్టర్కు లోడింగ్ చార్జీలు ఇచ్చి ఇసుకను లోడ్ చేసుకుంటున్నామని లారీల యాజమాన్లు వాపోతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.