epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

బుస కొడుతున్న భూకబ్జా ‘కోరులు’

బుస కొడుతున్న భూకబ్జా ‘కోరులు’
ఏనుమాముల–గొర్రెకుంటలో అక్రమ ఆక్రమణలు
రాత్రికి రాత్రే ఇండ్ల కూల్చివేత..
దిక్కుతోచని స్థితిలో 84 కుటుంబాలు

కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వరంగల్ జిల్లా ఏనుమాముల గ్రామ పరిధిలోని సర్వే నం.156/B/1, గొర్రెకుంట గ్రామ శివారులోని సర్వే నం.195లలో భూకబ్జాదారుల అకృత్యాలు వెలుగుచూశాయి. సుమారు 20 ఏళ్ల క్రితం మధ్యతరగతి కుటుంబాలు భవిష్యత్తు అవసరాల కోసం కొనుగోలు చేసిన ప్లాట్లను నకిలీ పత్రాలతో కబ్జా చేసిన ఘటన కలకలం రేపుతోంది. బాధితుల వివరాల ప్రకారం ఈ రెండు సర్వే నంబర్లలో మొత్తం 84 ప్లాట్లను కుటుంబాలు కొనుగోలు చేశాయి. కొందరు హౌస్ నంబర్లు 46-6-21/A/1, 46-6-217 తదితర ఇళ్లను నిర్మించుకుని నివసిస్తుండగా, మరికొందరు తమ పిల్లల పెళ్లిళ్లు, ఇతర అవసరాల కోసం ప్లాట్లను ఖాళీగా ఉంచారు.

తమకు న్యాయం చేయాలని ప్లాట్ల యజమానులు నిరసన వ్యక్తం చేస్తున్నారు

కోర్టు కేసు నడుస్తుండగానే దాడి

కొంతమంది భూకబ్జాదారులు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఈ భూములను తమ పేర్లకు బదిలీ చేయించుకునేందుకు ప్రయత్నించడంతో యజమానులు కోర్టును ఆశ్రయించారు. కేసు విచారణలో ఉండగానే ఈ నెల శుక్రవారం అర్ధరాత్రి తర్వాత పెద్ద సంఖ్యలో దుండగులు అక్కడికి చేరుకుని నివాసితులను బెదిరింపులకు గురిచేసి ఇళ్ల నుంచి బయటకు పంపినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. అనంతరం బుల్డోజర్లు, యంత్రాలతో ఇళ్లను కూల్చివేసినట్టు తెలిపారు. ఈ ఘటనపై బాధితులు పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించినా, “విషయం కోర్టులో ఉందని మరో కేసు నమోదు చేయలేము” అంటూ ఫిర్యాదు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. దీంతో బాధిత కుటుంబాలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నాయి. రాత్రి వేళ ఇళ్లలో ఉండేందుకు కూడా భయపడుతున్నామని వాపోతున్నారు. “మా వద్ద అసలు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, పాత పహాణీలు, పన్నుల రసీదులు అన్నీ ఉన్నాయి. కోర్టు కేసు నడుస్తుండగానే ఇళ్లను కూల్చడం ఎంతవరకు న్యాయం?” అంటూ బాధితులు ప్రశ్నిస్తున్నారు. జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, రెవెన్యూ ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకుని సర్వే నిర్వహించి నిజానిజాలు తేల్చాలని, నకిలీ పత్రాలతో భూములు కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు రక్షణ కల్పించాలని 84 కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.