epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

అనుమతులు ఒకలా.. నిర్వహణ మరోలా..!

అనుమతులు ఒకలా.. నిర్వహణ మరోలా..!
వెంకటేశ్వర వైన్స్‌లో నిబంధనలకు తూట్లు
బహిరంగంగానే ఉల్లంఘనలు – కాన‌రాని త‌నిఖీలు

కాకతీయ, కరీంనగర్ :కరీంనగర్ నగరంలో వైన్స్ నిర్వాహకులు నిబంధనలను బేఖాతరు చేస్తూ లాభాలే లక్ష్యంగా ఇష్టారాజ్యంగా వ్యాపారం సాగిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చట్టబద్ధంగా తీసుకున్న అనుమతులు ఒకలా ఉండగా, క్షేత్రస్థాయిలో నిర్వహణ మాత్రం పూర్తిగా విరుద్ధంగా కొనసాగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పర్మిట్ రూంల నిర్వహణకు స్పష్టమైన నియమాలు ఉన్నప్పటికీ, వాటిని పక్కనపెట్టి అనధికార సిట్టింగ్లు, టేబుళ్లు ఏర్పాటు చేసి మద్యం సేవించేందుకు సౌకర్యాలు కల్పిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆహార భద్రత, పరిశుభ్రత వంటి మౌలిక నిబంధనలను పూర్తిగా విస్మరిస్తూ ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా నిర్వాహకులు వ్యవహరిస్తున్నారని అంటున్నారు. అనుమతుల పరిధిని దాటి షెడ్లు, విస్తరణలతో వ్యాపారం నడపడం చట్టాలకే సవాల్‌గా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ఉల్లంఘనలు బహిరంగంగానే జరుగుతున్నా సంబంధిత శాఖల పర్యవేక్షణ కనిపించకపోవడం అనేక అనుమానాలకు దారి తీస్తోంది.

నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన రెండు పర్మిట్ రూంలు వైన్స్ పర్మిట్ రూంలో కనపడని ఆహార భద్రత, పరిశుభ్రత నిబంధనలు

వెంకటేశ్వర వైన్స్‌లో ఇష్టారాజ్యం

నగరంలోని అంబేద్కర్ స్టేడియం సమీపంలో ఉన్న వెంకటేశ్వర వైన్స్‌లో నిబంధనలను పక్కనపెట్టి మద్యం వ్యాపారం సాగుతోందన్న ఆరోపణలు తీవ్రమవుతున్నాయి. పర్మిట్ రూంకే అనుమతి ఉన్నప్పటికీ, అనధికారంగా సిట్టింగ్లు ఏర్పాటు చేసి మద్యం సేవించేందుకు సౌకర్యాలు కల్పిస్తున్నారని తెలుస్తోంది. పర్మిట్ రూంలో ఆహార భద్రత, పరిశుభ్రతకు సంబంధించిన నిబంధనలు ఎక్కడా అమలవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. అదేవిధంగా వైన్స్ పై అంతస్తులో నిబంధనలను విస్మరిస్తూ షెడ్ ఏర్పాటు చేసి సుమారు 20 టేబుళ్లతో వ్యాపారం నిర్వహిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జనసంచారం అధికంగా ఉండే ప్రాంతంలోనే ఈ ఉల్లంఘనలు కొనసాగుతున్నా తనిఖీలు లేకపోవడంపై ప్రజలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

మామూళ్ల మాటున తనిఖీలు మాయం

బహిరంగంగానే అనధికార షెడ్డులు, నిబంధనలకు విరుద్ధమైన పర్మిట్ రూంల నిర్వహణ జరుగుతున్నా సంబంధిత అధికారుల తనిఖీలు కనిపించకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఈ అక్రమాల వెనుక నెలవారీ మామూళ్లే కారణమన్న ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. మామూళ్లు అందితే నిబంధనల ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఎక్సైజ్ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి, నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం సాగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.