epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

అంతర్‌రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

అంతర్‌రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
* పశ్చిమ బెంగాల్‌కు చెందిన గ్యాంగ్ పట్టివేత
* రూ.16 లక్షల విలువైన బంగారు–వెండి నగలు స్వాధీనం
* సీసీఎస్–కెయూసీ పోలీసుల సమన్వయ ఆపరేషన్

కాకతీయ, హనుమకొండ : పట్టపగలు ఇండ్ల తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన అంతర్‌రాష్ట్ర దొంగల ముఠాను వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సీసీఎస్, కెయూసీ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి సుమారు రూ.16 లక్షల విలువైన బంగారు, వెండి నగలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 15 తులాల బంగారు నగలు, 5.5 తులాల వెండి నగలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. రెండు మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టు అయిన నిందితులు ఫెరోజ్ షేక్, సుక్ చంద్, యామీన్‌లుగా గుర్తించారు. వీరంతా పశ్చిమ బెంగాల్‌లోని ముర్షీదాబాద్ జిల్లా, బేలదంగా తాలూకా, ముజ్‌పార్ గ్రామానికి చెందినవారిగా పోలీసులు వెల్లడించారు. మరో నిందితుడు ఫెరోజ్ షేక్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలిపారు.
దొంగతనాలే జీవనం..!
మద్యం, హెరాయిన్ వంటి మత్తు పదార్థాలకు బానిసలై సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ ముఠా పట్టపగలే ఇండ్లను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు విచారణలో తేలింది. బంగారు, వెండి నగలను దొంగిలించి అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నారని పోలీసులు తెలిపారు. గతంలో పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర రాష్ట్రాల్లోనూ ఈ ముఠా దొంగతనాలకు పాల్పడింది. ఆయా రాష్ట్రాల పోలీసుల చేత అరెస్టై జైలు పాలైన చరిత్ర కూడా ఉంది. రెండు నెలల క్రితమే పశ్చిమ బెంగాల్ జైలు నుంచి విడుదలై తెలంగాణలో మళ్లీ దొంగతనాలకు పథకం వేసినట్లు వెల్లడైంది.
హనుమకొండ పరిధిలో 2025 డిసెంబర్ 17న పరిమళ కాలనీ, సప్తగిరి కాలనీల్లో రెండు ఇండ్లలో దొంగతనాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం డిసెంబర్ చివర్లో మరోసారి ప్రయత్నించి విఫలమయ్యారు. 2026 జనవరి 10న గోపాలపురం, శివసాయి కాలనీలోని ఒక ఇంట్లో తాళం పగలగొట్టి 15 తులాల బంగారం, 5 తులాల వెండి నగలు, నగదు దోచుకున్నట్లు వెల్లడించారు.
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు డీసీపీ సెంట్రల్ జోన్ దారా కవిత పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యాయి. సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుల ఆచూకీ కనిపెట్టి కెయూసీ జంక్షన్ వద్ద వాహనాల తనిఖీ సమయంలో పట్టుకున్నారు. పారిపోవడానికి ప్రయత్నించగా అదుపులోకి తీసుకుని విచారించగా నేరాలను ఒప్పుకున్నారు.
పోలీసులకు ప్రశంసలు
ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ కె. రామకృష్ణ, కెయూసీ ఇన్‌స్పెక్టర్ ఎస్. రవికుమార్, ఐటీ కోర్ టీం ఏఏఓ ఎం.డి. సల్మాన్ పాషా, సీసీఎస్ ఎస్సైలు రాజ్‌కుమార్, సాయి ప్రసన్న కుమార్, శ్రీనివాస రాజు, హెడ్ కానిస్టేబుళ్లు కె. మహేశ్వర్, వి. జంపయ్య, కానిస్టేబుళ్లు టి. మధుకర్, బి. చంద్రశేఖర్, ఎస్. రాములు, జి. ఉపేందర్, కె. వంశీ, జి. విశ్వేశ్వర్, జి. వినోద్‌లను పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ అభినందించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.